Sarfaraz Khan : టీమ్ఇండియాలో చోటు దక్కిన తరువాత.. సర్ఫరాజ్ ఖాన్ మొదటి రియాక్షన్ ఇదే..
ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.
![Sarfaraz Khan : టీమ్ఇండియాలో చోటు దక్కిన తరువాత.. సర్ఫరాజ్ ఖాన్ మొదటి రియాక్షన్ ఇదే.. Sarfaraz Khan : టీమ్ఇండియాలో చోటు దక్కిన తరువాత.. సర్ఫరాజ్ ఖాన్ మొదటి రియాక్షన్ ఇదే..](https://10tv.in/wp-content/uploads/2024/01/New-Project-7-39.jpg)
Sarfaraz Khan
Sarfaraz : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది. గాయాల కారణంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ లు జట్టుకు దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో నాలుగు టెస్టు మ్యాచులు ఆడిన వాషింగ్టన్ సుందర్‌తో పాటు ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేయని సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్‌లకు సెలక్టర్లు అవకాశం కల్పించారు. ఇందులో అందరి దృష్టి ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ పైనే ఉంది.
గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్లో ఎంతో నిలకడగా రాణిస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్. టెస్టు సిరీస్ కోసం జట్టును ప్రకటించిన ప్రతి సందర్భంలోనూ అతడి పేరు మీడియాలో పెద్ద ఎత్తున చర్చకొస్తుంది. అయితే.. సీనియర్ల వల్ల అతడు రేసులో వెనబడిపోతున్నాడు అని అనేవారు. ఈ క్రమంలో కొంతకాలంగా ఈ ముంబై బ్యాటర్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగాయి. కాగా.. ఎట్టకేలకు అతడికి అవకాశం దక్కింది. దీంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.
ఇక ఎట్టకేలకు భారత జట్టులో చోటు దక్కించుకున్న తరువాత సర్ఫరాజ్ ఖాన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను పంచుకున్నాడు. టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఇండియాకు ఎంపిక అయ్యాను. వేడులకు సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చాడు.
మరికొంతసేపటి తరువాత సర్ఫరాజ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోని కూడా పంచుకున్నాడు.
Viral Video : క్రికెట్ మ్యాచా.. కామెడీ షోనా.. వీడియో చూస్తే పగలబడి నవ్వుతారు
ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌కు అప్డేట్ చేసిన భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్.