Shane Warne: షేన్ వార్న్ మరణం వెనుక నిజాలు బయటపెట్టిన అటాప్సీ రిపోర్ట్
లెజండరీ క్రికెటర్ షేన్ వార్న్ అటాప్సీ రిపోర్టుతో మరణం వెనుక నిజాలు సోమవారం వెలుగుచూశాయి. అతని శరీరంపై వేరే ఇతర గాయాలు, గుర్తులు లేవని స్పష్టం చేశారు.
- Subhan Ali Shaik
- Published On : March 7, 2022 / 04:37 PM IST
Shane Warne
Shane Warne: లెజండరీ క్రికెటర్ షేన్ వార్న్ అటాప్సీ రిపోర్టుతో మరణం వెనుక నిజాలు సోమవారం వెలుగుచూశాయి. పోలీస్ లెఫ్టినెంట్ జనరల్ సూరచతె హక్పార్న్, అసిస్టెంట్ కమిషనర్ జనరల్ లు వార్న్ మరణంపై కొద్ది రోజులుగా దర్యాప్తు జరుపుతున్నామని సహజ కారణాలతోనే మృతి చెందినట్లు పేర్కొన్నారు. అతని శరీరంపై వేరే ఇతర గాయాలు, గుర్తులు లేవని స్పష్టం చేశారు.
షేన్ వార్న్ కుటుంబ సభ్యులకు అటాప్సీ గురించి సమాచారం ఇచ్చాం. అతని శరీరాన్ని ఆస్ట్రేలియన్ క్యాన్సులర్ అఫీషియల్ కు పంపించి ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.
‘ఈ రోజు ఇన్వెస్టిగేటర్లకు అటాప్సీ రిపోర్ట్ వచ్చింది. అందులో చనిపోవడానికి కారణం నేచురల్ అని ఉంది’ అని కిస్సానా పాథనచారోన్ స్టేట్మెంట్ లో వెల్లడించారు. చట్ట ప్రకారం దర్యాప్తు జరపడానికి అటాప్సీ రిపోర్టును వినియోగిస్తారని తెలిపారు.
Read Also: షేన్ వార్న్ మృతిపై అనుమానాలు! సంచలన విషయాలు
థాయ్‌లాండ్‌కు పర్సనల్ ట్రిప్ పై వెళ్లిన షేన్ వార్న్.. గత శుక్రవారం గుండెపోటుతో మరణించారు. థాయ్‌లాండ్‌లోని ఒక విల్లాలో స్పృహలో లేకుండా పడి ఉండటాన్ని గమనించిన అతని స్నేహితుడు హాస్పిటల్ కు తరలించారు. అంతకుముందు తన స్నేహితుడితో ఛాతీ నొప్పి, శ్వాస అందడం లేదని చెప్పాడట.
వార్న్ కు ఆస్తమాతో పాటు, కొన్ని గుండె సమస్యలు కూడా ఉన్నాయని థాయ్ పోలీసులు చెబుతున్నారు.
