Kavya Maran Wedding : పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య పాప.. ఆ రాక్ స్టార్ తో..?
Kavya Maran Wedding : కావ్య పాల పెళ్లి పీటలు ఎక్కబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
- Dharani Pilli
- Updated on- May 22, 2026 / 06:11 PM IST
srh kavya maran and anirudh ravichander wedding rumors viral on social media
Kavya Maran Wedding : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌కు సూపర్ క్రేజ్. అభిమానులు ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. ఈ క్రమంలో కావ్య మారన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. అతి త్వరలోనే ఈ అమ్ముడు పెళ్లి పీటలు ఎక్కబోతుందంట. ఇంతకూ వరుడు ఎవరంటే.. దాదాపు దక్షిణాది అంతా తెలిసిన ప్రముఖ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
అసలు వీరిద్దరికీ పెళ్లి అనే వార్తలకు గతేడాదిలోనే బీజం పడింది. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఏడాది నుంచి పుకార్లు షికారు చేస్తున్నాయి. పోయిన సంవత్సరం వీరిద్దరూ న్యూయార్క్‌లో జంటగా కనిపించడంతో వీరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో వీరిద్దరి గురించి నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. గతేడాదే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు రాగా.. అనిరుధ్ వీటిని కొట్టి పారేశారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి వీరిద్దరి పెళ్లి వార్తలు తెరమీదకు వచ్చాయి.
తాజాగా ఓ నివేదిక వెల్లడించిన సమాచారం ప్రకారం.. కావ్య మారన్, అనిరుధ్ ఇరువురి కుటుంబాలు వీరి పెళ్లికి ఆమోదం తెలిపాయని.. స్పెయిన్‌లో వీరి వివాహం జరిపించాలని ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక వీరి వివాహానికి సంబంధించిన వైరల్ అవుతోన్న వార్తల్లో ఒకటి మాత్రం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.
*ఐపీఎల్ నుంచి ఔట్.. సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్‌తో పాటు ఆ జట్టు ఆటగాళ్లకు బీసీసీఐ భారీ జరిమానా..
మరో క్రేజీ లీక్ ఏంటంటే.. అనిరుధ్ రవిచందర్‌కు వరుసకు మావయ్య అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ వీరి వివాహం కోసం స్వయంగా రంగంలోకి దిగారని తమిళ మీడియా కోడై కూస్తోంది. రజనీకాంత్ స్వయంగా కళానిధి మారన్‌తో మాట్లాడి అనిరుధ్-కావ్యల పెళ్లి జరిపించాలని కోరారని.. రెండు వైపులా ఉన్న పెద్దలు వీరి వివాహానికి ఆమోదం తెలిపారని తమిళ మీడియా వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.. అయితే, ఈ విషయాలపై సన్ నెట్‌వర్క్ కానీ, ఇటు అనిరుధ్ కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు. అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
*సన్‌రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫయర్-1 ఆడాలంటే.. ఆర్‌సీబీపై ఎంత తేడాతో గెలవాలంటే?
ఈ పుకార్లకు మరో ముఖ్య కారణం కావ్య మారన్ తండ్రి, మీడియా మొఘల్ కళానిధి మారన్‌కు చెందిన సన్ పిక్చర్స్ బ్యానర్‌లో.. అనిరుధ్ వరుసగా పెద్ద సినిమాలకు మ్యూజిక్ అందిస్తుండటం.. ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది.
ఈ వార్తలు పక్కన పెడితే.. ప్రస్తుతం వీరిద్దరూ తమ కెరీర్ మీదనే పూర్తిగా దృష్టి సారించారు. అనిరుధ్ ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్‌గా.. జైలర్ 2, జననాయగన్, షారూఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ వంటి భారీ పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు, కావ్య మారన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ పనులతో పాటు, ఇటీవల సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఈస్టర్న్ కేప్ టీమ్ వరుసగా టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించి బిజినెస్ ఉమెన్‌గా బిజీగా గడుపుతున్నారు.
