Steve Smith : దిగ్గ‌జ ఆట‌గాడు స్టీవ్ వా రికార్డు బ్రేక్ చేసిన స్టీవ్ స్మిత్

ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు స్టీవ్ స్మిత్ (Steve Smith) టెస్టుల్లో ఓ అరుదైన రికార్డును సాధించాడు

Steve Smith becomes Australias third highest run scorer in Test cricket

Steve Smith : ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు స్టీవ్ స్మిత్ టెస్టుల్లో ఓ అరుదైన రికార్డును సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. డ‌ర్బ‌న్ వేదిక‌గా శుక్ర‌వారం ద‌క్షిణాఫ్రికాతో ప్రారంభ‌మైన తొలి టెస్టు మ్యాచ్‌లో 8 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద అత‌డు ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో అతడు ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు స్టీవాను అధిగ‌మించాడు.

168 టెస్టుల్లో స్టీవా 10927 ప‌రుగులు చేయ‌గా స్టీవ్ స్మిత్ కేవ‌లం 126 టెస్టుల్లో అధిగ‌మించ‌డం విశేషం. ఇక ఆస్ట్రేలియా త‌రుపున టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డు రికీ పాంటింగ్ పేరిట ఉంది. పాంటింగ్ 168 టెస్టుల్లో 13378 ప‌రుగులు సాధించాడు. ఇక రెండో స్థానంలో అలెన్ బోర్డ‌ర్ ఉన్నాడు.

టెస్టుల్లో ఆస్ట్రేలియా త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

* రికీ పాంటింగ్ – 168 మ్యాచ్‌ల్లో 13378 ప‌రుగులు
* అలెన్ బోర్డర్ -156 మ్యాచ్‌ల్లో 11174 ప‌రుగులు
* స్టీవ్ స్మిత్ – 126 మ్యాచ్‌ల్లో 10945 ప‌రుగులు
* స్టీవ్ వా – 168 టెస్టుల్లో 10927 ప‌రుగులు
* డేవిడ్ వార్న‌ర్ – 112 టెస్టుల్లో 8786 ప‌రుగులు

IND vs NZ : భార‌త్‌తో మ్యాచ్‌ల‌కు ముందు న్యూజిలాండ్‌కు వ‌రుస షాక్‌లు..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. మ్యాట్ రెన్‌షా (46), ప్యాట్ క‌మిన్స్ (33) క్రీజులో ఉన్నారు. మార్న‌స్ ల‌బుషేన్ (37), స్టీవ్ స్మిత్ (25) ప‌ర్వాలేద‌నిపించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో వియాన్ ముల్డ‌ర్‌, మార్కో యాన్సెన్‌, అన్రిచ్ నోకియా త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.