Harshit Rana : హాస్పిటల్ బెడ్‌పై నుంచే హర్షిత్ రాణా పోస్టు.. శస్త్రచికిత్స విజయవంతం.. ఇక నా దృష్టంతా..
హర్షిత్ రాణాకు (Harshit Rana ) నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది.
Surgery successfull Harshit Rana now focused on recovery
Harshit Rana : టీమ్ఇండియా పేసర్ హర్షిత్ రాణాకు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ విషయాన్ని స్వయంగా అతడే సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అంతా బాగుంది అని అర్థం వచ్చేలా బొటన వేలిని చూపిస్తూ ఆస్పత్రిలో బెడ్ పై ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. అతడు త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం కోలుకోవడంపై దృష్టి పెట్టాను. త్వరలోనే బలంగా తిరిగి వస్తాను. అని హర్షిత్ రాణా సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
అసలేం జరిగిందంటే?
వాస్తవానికి టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నాడు. ఈ మెగాటోర్నీ ముందు దక్షిణాఫ్రికా జట్టుతో భారత జట్టు ఆడిన ఏకైక వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఒకే ఒక ఓవర్ వేశాడు. ఈ ఓవర్ వేసే క్రమంలో రెండు సార్లు తన రన్నప్‌ను మధ్యలో ఆపేశాడు. ఎలాగోలా ఓవర్‌ను పూర్తి చేసిన అతడు తన మోకాలి పట్టుకుని కనిపించాడు. నొప్పి తీవ్రంగా ఉండడంతో మైదానాన్ని వీడాడు.
View this post on Instagram
వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి స్కాన్లు నిర్వహించారు. అతడికి తీవ్రమైన గాయం అని శస్త్రచికిత్స అవసరం అని తెలియడంతో అతడు టీ20 ప్రపంచకప్ 2026 నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో బీసీసీఐ మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకుంది. ఇక సిరాజ్ యూఎస్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లతో సత్తా చాటాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆస్పత్రిలో ఉన్న హర్షిత్ రాణాకు శస్త్రచికిత్స చేశారు.
