T20 World Cup 2021: విరాట్ కోహ్లీ పేరిట కెప్టెన్ గా నమోదైన చెత్త రికార్డు.., గొప్ప రికార్డు
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఓ చెత్త, గొప్ప రికార్డులు నమోదు చేసుకున్నాడు.
- Subhan Ali Shaik
- Published On : October 25, 2021 / 11:45 AM IST
New Project(3)
T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఓ చెత్త, గొప్ప రికార్డులు నమోదు చేసుకున్నాడు. సూపర్ 12 స్టేజిలో గ్రూప్ 2లోని ఇండియా.. పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో 10వికెట్ల తేడాతో గెలిచింది పాకిస్తాన్.
అంతే భారీ తేడాతో టీమిండియా ఓడిపోయిన తొలి మ్యాచ్ కూడా ఇదే. ఈ విజయంతో పాటు 30ఏళ్లలో భారత్ పై ఓపెనర్లు అత్యధిక ఓపెనింగ్ పార్టనర్‌షిప్ నమోదు చేయడం కూడా ఇదే తొలిసారి.
తొలి కెప్టెన్‌గా రికార్డు:
టీ20 వరల్డ్ కప్ లో 50పరుగులకు మించిన స్కోరు చేసిన తొలి ఇండియన్ కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు నమోదు చేశాడు. మిగతా హాఫ్ సెంచరీలన్నీ ఎంఎస్ ధోనీ కెప్టెన్ గా ఉన్న సమయంలోనే బాదాడు విరాట్.
……………………………………… : పాలు రాత్రి సమయంలోనే ఎందుకు తాగుతారో తెలుసా..
అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్థాన్ 625 మ్యాచ్‌లు ఆడింది. పాకిస్తాన్ పై 226పరుగులు చేసిన కోహ్లీ.. తొలి సారి ఈ మ్యాచ్‌లో అవుట్ అవడంతో పాటు 57పరుగులు సాధించాడు. ఫలితంగా జట్టు 151 పరుగులు చేయగలిగింది. గత మ్యాచ్ లలో మూడు ఇన్నింగ్స్ ఆడి అవుట్ అవకుండా 169పరుగులు చేశాడు. కాకపోతే బ్యాటింగ్ లో నిలబడి స్కోరు సాధించినప్పటికీ పాకిస్తాన్ జట్టును కట్టడి చేయలేకపోయాడు కెప్టెన్ విరాట్.
