Abhishek Sharma : 2 కిలోల బరువు తగ్గిన అభిషేక్ శర్మ.. పాక్‌తో మ్యాచ్ ఆడతాడా? లేదా? ఏం చెప్పాడంటే?
టీమ్ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ రెండు కిలోల బరువు తగ్గాడు.
T20 World Cup 2026 Abhishek Sharma Shares Health Update Ahead Of Pakistan Clash
- అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ శర్మ
- నమీబియాతో మ్యాచ్ కు దూరం
- తన హెల్త్ అప్డేట్ పై ఏమన్నాడంటే
Abhishek Sharma : టీమ్ఇండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈక్రమంలోనే అతడు గురువారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. ఇక ఆదివారం (ఫిబ్రవరి 15)న కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడతాడో లేదోనన్న సందేహం నెలకొంది. ఈ నేపథ్యంలో అతడు పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వ్లాగ్‌లో కనిపించాడు. అతడు కోలుకున్నప్పటికి కూడా 100 శాతం ఫిట్నెస్ సాధించలేదు. ఈ విషయన్నే అభిషేక్ చెప్పాడు.
ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే.. రెండు కిలోల బరువు తగ్గానని తెలిపాడు. కఠినమైన డైట్‌ను ఫాలో అవుతున్నానని అన్నాడు.
పాక్‌తో ఆడతాడా?
యూఎస్ఏతో మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ కడుపునొప్పితో బాధపడ్డాడు. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. డిశ్చార్జి కూడా అయ్యాడు. అతడు కోలుకున్నప్పటికి పూర్తి మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని గురువారం నమీబియాతో మ్యాచ్ సందర్భంగా టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం వెల్లడించాడు. అభిషేక్.. ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు దూరం కావొచ్చునని చెప్పుకొచ్చాడు.
Update on Abhishek Sharma by Arshdeep Singh, good to know he’s doing good 😄 pic.twitter.com/MbvOzMChmg
— 𝗠𝗮𝗻𝗶𝘀𝗵 (@ManishSRH) February 12, 2026
ప్రాక్టీస్ చేస్తున్నాడు..
అభిషేక్ శర్మ ప్రస్తుతం బాగానే ఉన్నాడని టీమ్ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నమీబియాతో మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పాడు. అతడు ప్రాక్టీస్ సైతం చేస్తున్నట్లుగా వెల్లడించాడు. పాక్ తో మ్యాచ్ ఆడే అవకాశం ఉందన్నాడు.
ఒకవేళ అభిషేక్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే అప్పుడు.. ఇషాన్ కిషన్‌కు తోడుగా సంజూ శాంసన్ పాక్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు.
