T20 World Cup 2026 South Africa win by 6 wickets against United Arab Emirates
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో ఇప్పటికే సూపర్-8 బెర్తును ఖాయం చేసుకున్న సౌతాఫ్రికా చివరి నామమాత్రమైన గ్రూప్ మ్యాచ్‌లోనూ గెలుపొందింది.
బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూఏఈని చిత్తు చేసింది. కాగా.. గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని సౌతాఫ్రికా సూపర్-8లో అజేయ జట్టుగా బరిలోకి దిగనుంది.
T20 World Cup 2026 : వర్షం కారణంగా నమీబియాతో మ్యాచ్ రద్దైతే.. పాక్‌కు లాభమా? నష్టమా?
🚨 MATCH RESULT 🚨#TheProteas cruise to a commanding 6-wicket win to close out the group stage of the #T20WorldCup. 🏏👏
A clean sweep of the group sets us up perfectly for the highly anticipated Super 8 phase of the competition! 😤🇿🇦#Unbreakable pic.twitter.com/MQrKXBvblK
— Proteas Men (@ProteasMenCSA) February 18, 2026
123 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 13.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్ (30; 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (36; 25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ (28; 11 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించారు.
Kuldeep Yadav : నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. కుల్దీప్ యాదవ్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..
ఓపెనర్ క్వింటన్ డికాక్ (16 బంతుల్లో 14 పరుగులు) పర్వాలేదనిపించాడు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ, మహమ్మద్ జవదుల్లా, ముహమ్మద్ ఫరూఖ్,ముహమ్మద్ అర్ఫాన్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.