T20 World Cup 2026 : నమీబియాతో మ్యాచ్‌లో పాక్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? అమెరికా, పాక్‌లలో సూపర్-8కి అర్హత సాధించేది ఎవరు?
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) నమీబియా పై పాకిస్థాన్ ఓడిపోతే సూపర్-8 ఎవరు అర్హత సాధిస్తారు అనేది అందరిలో ఆసక్తి నెలకొంది.
T20 World Cup 2026 what happen if Pakistan lose match to Namibia
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8కి వెళ్లే ఏ జట్లు ఏవో దాదాపుగా తేలిపోయాయి. ఇప్పటికే ఏడు జట్లు.. భారత్, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లు సూపర్-8కి అర్హత సాధించాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం పాకిస్థాన్, అమెరికా పోటీపడుతున్నాయి.
ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు పాక్ మూడు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేటు -0.403గా ఉంది. అమెరికా గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లు (4 మ్యాచ్‌లు) ఆడేసింది. రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఆ జట్టు ఖాతాలో 4 పాయంట్లు ఉండగా నెట్‌రన్‌రేటు +0.788గా ఉంది.
T20 World Cup 2026 : టీమ్ ఇండియా సూపర్ 8 షెడ్యూల్ ఫిక్స్.. ఏ జట్టుతో ఏ రోజున ఆడనుందంటే?
గ్రూప్-ఏలో పాకిస్థాన్, అమెరికా లు ఉన్నాయి. ఇప్పటికే ఈ గ్రూప్ నుంచి భారత్ సూపర్ 8కి అర్హత సాధించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అమెరికా రెండో స్థానంలో ఉండగా పాక్ మూడో స్థానంలో ఉంది. ఇక పాక్ జట్టు గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌ను నేడు (బుధవారం) కొలంబో వేదికగా నమీబియాతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే సూపర్ 8కి అర్హత సాధిస్తుంది.
నమీబియా చేతిలో పాక్ ఓడిపోతే..
ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన నమీబియా ఇప్పటికే సూపర్-8 రేసు నుంచి నిష్ర్కమించింది. ఈ క్రమంలో పాక్‌తో మ్యాచ్‌లో ఓడిపోయినా పెద్దగా నష్టపోయేది ఏమీ లేదు కాబట్టి ఆ జట్టు తెగించి ఆడొచ్చు. భారత్ చేతిలో అవమానకరమైన ఓటమితో పాక్ పై స్వదేశంలోనే విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో నమీబియా పై గెలుపొంది సూపర్-8కి అర్హత సాధించడం ఆ జట్టుకు ఎంతో ముఖ్యం.
T20 World Cup 2026 : టీమ్ ఇండియా సూపర్ 8 షెడ్యూల్ ఫిక్స్.. ఏ జట్టుతో ఏ రోజున ఆడనుందంటే?
అలా కాకుండా నమీబియా చేతిలో పాక్ జట్టు ఓడిపోతే అప్పుడు అమెరికా సూపర్-8కి అర్హత సాధిస్తుంది. నమీబియా చేతిలో పాక్ ఓడిపోతే.. అప్పుడు కూడా అమెరికా, పాక్ జట్ల పాయింట్లు సమానంగా ఉంటాయి. అయితే.. అమెరికా నెట్‌రన్‌రేటు మెరుగ్గా ఉండడంతో ముందజ వేస్తుంది. పాక్ ఇంటి ముఖం పడుతుంది.
