×
Ad

Vaibhav Suryavanshi Uncle in UPSC : అల్లుడు క్రికెటర్.. మామ IPS.. సివిల్స్ తొలి ప్రయత్నంలోనే అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ మామ

Vaibhav Suryavanshi Uncle in UPSC : వైభవ్ సూర్యవంశీ కుటుంబం ఆనందంలో ముగిని తేలుతుంది. కారణం అతడి మేనమామ తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ క్రాక్ చేశారు.

Vaibhav suryavanshi uncle abhishek chauhan selected for ips upsc results 2025

Vaibhav Suryavanshi Uncle in UPSC :బవైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో అతడో సంచలనం. పట్టుమని 15 సంవత్సరాలు కూడా లేని ఈ చిచ్చరపిడుగు.. క్రికెట్ మైదానంలో మాత్రం బ్యాట్ తో చెలరేగుతున్నాడు. గతేడాది ఐపీఎల్ తో ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ.. అండర్ 19 వరల్డ్ కప్ లో మైదానంలో బౌండరీల మోత మోగించి నయా రికార్డులు క్రియేట్ చేసి హీరోగా నిలిచాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు సూర్యవంశీ మేనమామ కూడా సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. తాజాగా ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో వైభవ్ సూర్యవంశీ మామ 102 వ ర్యాంకు సాధించారు. అది కూడా తొలి ప్రయత్నంలోనే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మామ, అల్లుళ్ల సక్సెస్ స్టోరీలు తెగ వైరల్ అవుతున్నాయి.

వైభవ్ సూర్యవంశీ మేనమామ అయిన అభిషేక్ చౌహాన్ తాజాగా వెల్లడించిన యూపీఎస్సీ ఫలితాల్లో 102వ ర్యాంకు సాధించి.. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. తొలి ప్రయత్నంలోనే అభిషేక్ 102వ ర్యాంకు సాధించడం విశేషం. అతడి స్వస్థలం బిహార్, సమస్తీపుర్ జిల్లా మొహియుద్దీన్ నగర్ లోని రాజజన్ గ్రామం. అభిషేక్ తండ్రి డాక్టర్ అభయ్ కుమార్. ఆయన ప్రస్తుతం నలంద ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా సేవలందిస్తున్నారు. అభిషేక్ తల్లి అనురాధ రాజ్పుత్. అభిషేక్ సాధించిన విజయం పట్ల సూర్యవంశీ తండ్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది.

అభిషేక్ చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. ఆరో తరగతి అడ్మిషన్ కోసం సైనిక్ స్కూల్, ఆర్కే మిషన్ ప్రవేశ పరీక్షలు రెండింటిలో అర్హత సాధించారు. ఎంటెక్ లో గోల్డ్ మెడల్ సాధించారు. 2022 నుంచి సివిల్స్ కోసం సన్నద్ధమవుతున్నారు. 2025లో పరీక్షకు దరఖాస్తు చేసి.. తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ కు సెలక్ట్ అయ్యారు. విషయం తెలుసుకున్న నెటిజనులు అల్లుడు క్రికెట్ లో సత్తా చాటుతుంటే.. మామ సివిల్స్ లో ర్యాంక్ కొట్టారు.. టాలెంట్ మీ సొత్తు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.