Hardik Pandya : వాలెంటైన్స్ డే స్పెషల్.. తన ప్రియురాలు మహికా శర్మకు హార్దిక్ పాండ్యా అదిరిపోయే గిఫ్ట్
వాలెంటైన్స్ డే సందర్భంగా టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya ) తన ప్రేయసి మహికా శర్మ కు ఓ అదిరిపోయే గిఫ్ట్‌ను అందించాడు.
Valentines Day Hardik Pandya Stunning Gift For Mahieka Sharma
Hardik Pandya : వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు.. ప్రేమికులు తమ భాగస్వామికి రకరకాల బహుమతులు ఇస్తూ తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా తన ప్రేయసి మహికా శర్మ కు ఓ అదిరిపోయే గిఫ్ట్‌ను అందించాడు. హార్దిక్ తన మెడపై తన ప్రేయసి పేరులోని తొలి అక్షరాన్ని (M) టాటూగా వేయించుకున్నాడు. ఈ టాటూలో రెండు చిరుతపులులు వాటి మధ్య M అనే అక్షరం డిజైన్ చేయబడి ఉంది. ఇది వారి బలమైన బంధాన్ని, ప్రేమను సూచిస్తుంది.
ఇందులో ఒక చిరుతపులి ధైర్యంగా, వాస్తవికంగా కనిపిస్తుంది, ఇది కనిపించే బలం, ఉత్సాహం, ఆశయాన్ని సూచిస్తుంది. రెండవ చిరుతపులి లైన్ వర్క్ ద్వారా ఏర్పడుతుంది. మొదటి దాని చుట్టూ నీడలా కదులుతుంది. దాని వక్రరేఖలలో సూక్ష్మంగా మహికా యొక్క మొదటి అక్షరం M అక్షరాన్ని ఏర్పరుస్తుంది. ఈ డిజైన్ ఇద్దరు బలమైన వ్యక్తులు సంబంధంలో వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా కలిసి అమరికలో కదులుతున్నట్లు ప్రతిబింబిస్తుంది.
మేం ఆస్ట్రేలియాని ఓడించామోచ్.. జింబాబ్వే కెప్టెన్ మాటల్లో ఆనందం.. వావ్..

ప్రస్తుతం హార్దిక్ టాటూకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హార్దిక్, మహికా ఇద్దరు కూడా పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకనే హార్దిక్ ఈ విధంగా ఆమె పేరును టాటూగా వేయించుకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ 2026లో బిజీగా ఉన్నాడు. తన ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో అదరగొడుతున్నాడు. ఆదివారం (ఫిబ్రవరి 15న) కొలంబో వేదికగా పాక్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
