Virat Kohli : 5 కోట్లు ఇచ్చి కోహ్లీని ఆశ్ర‌మానికి తీసుకొచ్చారా? అస‌లు నిజం ఇదే..

టీమ్ఇండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ (Virat Kohli), అత‌డి భార్య అనుష్క శ‌ర్మ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బృందావ‌న్‌లోని ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని త‌ర‌చుగా సంద‌ర్శిస్తుంటారు అన్న సంగ‌తి తెలిసిందే.

Virat Kohli Refutes Rs 5 Crore Claim Over Premanand Maharaj Ashram Visit

Virat Kohli : టీమ్ఇండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ, అత‌డి భార్య అనుష్క శ‌ర్మ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బృందావ‌న్‌లోని ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని త‌ర‌చుగా సంద‌ర్శిస్తుంటారు అన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ప్రేమానంద్ మహరాజ్‌కు ప్రాచుర్యం పెంచే ప్రయత్నాల్లో భాగంగా విరాట్ కోహ్లీని ఆశ్రమానికి తీసుకురావడానికి రూ.5 కోట్లు చెల్లించారని శ్రీకృష్ణ జన్మభూమి సంగ్రామ్ న్యాస్ అధ్యక్షుడు ఫలహారి మహరాజ్ దినేశ్ శర్మ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Gautam Gambhir : చ‌రిత్ర ద‌య‌తో ఉంటుంది.. అజిత్ అగార్క‌ర్‌ను ఉద్దేశించి సోష‌ల్ మీడియాలో గంభీర్ పోస్ట్‌.. వైర‌ల్‌..

దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగ‌గా.. విరాట్ కోహ్లీ టీమ్ స్పందించింది. అందులో ఎలాంటి వాస్త‌వం లేద‌ని చెప్పుకొచ్చింది. ‘ప్రేమానంద్ మహరాజ్‌పై ఉన్న గాఢమైన విశ్వాసం, గౌరవంతోనే విరాట్ కోహ్లీ బృందావ‌న్‌కు వెళ్తుంటారు. ఇందులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దు అని కోరుతున్నాం. ఇలాంటి వ్యాఖ్యలను ప్రచురించే లేదా విస్తృతంగా ప్రచారం చేసే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి.’ అని కోహ్లీ టీమ్ తెలిపింది.

తరచూ ఆశ్రమానికి కోహ్లీ దంపతులు..

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు రాధా కేలీ కుంజ్ ఆశ్రమాన్ని తరచూ సందర్శిస్తుంటారు. 2023 జనవరి 4న తొలిసారి వీరు ఆశ్ర‌మానికి వెళ్లారు. ఆత‌రువాత కోహ్లీ టీ20, టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన స‌మ‌యంలోనూ విరుష్క జంట బృందావ‌నం వెళ్లి ప్రేమానంద్ మ‌హారాజ్‌ని ద‌ర్శించుకుంది.

Bhuvneshwar Kumar : ఇన్నాళ్లు భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డానికి అజిత్ అగార్క‌రే కార‌ణం? షాకింగ్ రిపోర్టు!

అంత‌ర్జాతీయ టీ20, టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన విరాట్ కోహ్లీ వ‌న్డేల‌ను మాత్ర‌మే ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ముగిసిన వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్ లో కోహ్లీ అద్భుతం రాణించాడు. తొలి వ‌న్డే మ్యాచ్‌లో 139 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించాడు. ఈ సిరీస్‌ను భార‌త్ 2-1తో కైవ‌సం చేసుకుంది. ఇక న‌వంబ‌ర్ 4 నుంచి న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌లో కోహ్లీ ఆడ‌నున్నాడు.