Sameer Rizvi : 8.4 కోట్లకు కొన్న చెన్నై వదిలి వేస్తే.. డెడ్ చీప్‌గా సమీర్ రిజ్వీని దక్కించుకున్న ఢిల్లీక్యాపిటల్స్.. ఎంతో తెలుసా?
ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో సమీర్ రిజ్వీ (Sameer Rizvi) కీలక పాత్ర పోషించాడు.
What is Delhi Capitals player Sameer Rizvi IPL 2026 salary (pic credit @ipl)
- ఐపీఎల్ 2024 వేలంలో 8.4 కోట్లకు సమీర్ రిజ్వీని కొన్న చెన్నై
- ఆ సీజన్లో పేలవ ప్రదర్శన చేయడంతో వదిలేసిన సీఎస్కే
- ఐపీఎల్ 2025 వేలంలో చాలా తక్కువ మొత్తానికే దక్కించుకున్న ఢిల్లీ
Sameer Rizvi : ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. బుధవారం ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీ విజయంలో సమీర్ రిజ్వీ కీలక పాత్ర పోషించాడు.
142 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు 26 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సమీర్ రిజ్వీ (70 నాటౌట్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
Mohammed Shami : చరిత్ర సృష్టించిన షమీ.. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక బౌలర్
ఆరంభంలో లక్నో పేసర్లను ఎదుర్కొనేందుకు సమీర్ రిజ్వీ (Sameer Rizvi) ఇబ్బంది పడ్డాడు. అతడు తొలి 13 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. అయితే.. కాస్త కుదురుకున్నాక అతడు తన బ్యాట్ పవర్‌ను చూపించాడు. షాబాద్ అహ్మద్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదిన అతడు ఐడెన్ మార్క్రమ్ బౌలింగ్‌లో 6,4 బాది 37 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరో ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ (39 నాటౌట్) తో కలిసి అభేద్యమైన ఐదో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్ని అందించాడు.
చెన్నై వదిలేస్తే..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమీర్ రిజ్వీ యూపీ టీ20 లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. 2024లో ఈ లీగ్‌లో కేవలం 49 బంతుల్లోనే 104 పరుగులు చేయడంతో అందరి దృష్టి అతడిపై పడింది. ఐపీఎల్ 2024 వేలంలో అతడిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఈ నేపథ్యంలో రూ.8.4 కోట్ల భారీ మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ అతడిని దక్కించుకుంది.
అయితే.. ఐపీఎల్ 2024 సీజన్లో రిజ్వీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఐపీఎల్లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌గా మలిచిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 2024 సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడి కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సీజన్ ముగిసిన వెంటనే చెన్నై అతడిని వదిలివేసింది.
Sanjiv Goenka : ఈయన మారడు.. మ్యాచ్ ఓడిపోగానే లక్నో యజమాని సంజీవ్ గొయెంకా ఏం చేశాడో చూశారా?
అయితే.. ఐపీఎల్ 2025 మెగావేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిజ్వీని కేవలం 95 లక్షలకే దక్కించుకుంది. ఐపీఎల్ 2025 సీజన్లోనూ అతడు పెద్దగా రాణించలేదు. 5 మ్యాచ్‌లు ఆడగా 121 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికి కూడా ఢిల్లీ ఈ ఆటగాడిపై నమ్మకం ఉంచింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లోనే అతడు ఢిల్లీకి విజయాన్ని అందించి యాజమాన్యం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ప్రస్తుతం సమీర్ రిజ్వీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
