IND vs NZ : ఉదయం 7.30 గంటలకే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే.. జియోలో రాదు.. మరీ ఎక్కడ చూడొచ్చంటే?
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే మ్యాచ్ (IND vs NZ) ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
Where And When To Watch IND vs NZ ODI Series
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం నుంచి ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే మ్యాచ్‌కు ఆక్లాండ్ ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు ఆక్లాండ్ చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. తొలి వన్డేలో గెలిచి సాధించి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అదే సమయంలో వన్డే ప్రపంచకప్ 2027కు ఈ సిరీస్‌ను ఇరు జట్లు సన్నాహకంగా ఉపయోగించుకోనున్నాయి. దీంతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లోని మ్యాచ్‌లు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 3 గంటలకు ప్రారంభం కానున్నాయి. అంటే భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు ఉదయం 7.30 గంటలకే మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి.
Rohit Sharma : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మను ఊరిస్తున్న భారీ రికార్డులు ఇవే..
వన్డే సిరీస్ షెడ్యూల్..
* తొలి వన్డే – నవంబర్ 4న (ఆక్లాండ్ )
* రెండో వన్డే – నవంబర్ 7న (వెల్లింగ్టన్)
* మూడో వన్డే – నవంబర్ 10న (హామిల్టన్)
* నాలుగో వన్డే – నవంబర్ 13న (మౌంట్ మౌంగనుయి)
* ఐదో వన్డే – నవంబర్ 15న (మౌంట్ మౌంగనుయి)
ఎక్కడ చూడొచ్చంటే?
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జియో హాట్‌స్టార్‌లో రాదు. ఈ సిరీస్ ప్రసార హక్కులను సోనీ నెట్వర్క్ కలిగి ఉంది. ఈ క్రమంలో టీవీల్లో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఓటీటీలో అయితే.. సోనీ లివ్ యాప్, వెబ్సైట్లో స్ట్రీమింగ్ కానున్నాయి.
