Virat Kohli : విరాట్ కోహ్లీ సెంచరీ.. డిస్నీ+హాట్‌స్టార్ పంట పండింది..!
కోహ్లీ దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు చిత్తవ్వగా బ్రాడ్ కాస్టర్ డిస్నీ+హాట్ స్టార్ పంట పండింది.
![Virat Kohli : విరాట్ కోహ్లీ సెంచరీ.. డిస్నీ+హాట్‌స్టార్ పంట పండింది..! Virat Kohli : విరాట్ కోహ్లీ సెంచరీ.. డిస్నీ+హాట్‌స్టార్ పంట పండింది..!](https://10tv.in/wp-content/uploads/2023/11/New-Project-2-16.jpg)
Virat Kohli century creates new record
Virat Kohli century : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సెంచరీ చేసి తన పుట్టిన రోజును చిరస్మరణీయం చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 49వ సెంచరీ కావడం విశేషం. కోహ్లీ దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు చిత్తవ్వగా బ్రాడ్ కాస్టర్ డిస్నీ+హాట్ స్టార్ పంట పండింది. లైవ్ స్ట్రీమ్‌లో వ్యూయర్స్ అమాంతం పెరిగి ఆల్‌టైమ్ రికార్డును తాకింది.
విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసే సమయంలో 4.4 కోట్ల మంది లైవ్‌స్ట్రీమింగ్‌లో వీక్షించారు. ఓ ఈవెంట్‌ను ఒకేసారి అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు లైవ్‌స్ట్రీమింగ్‌లో చూడడం ఇదే మొదటి సారి. ఈ మెగాటోర్నీలోనే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 95 పరుగుల వద్ద ఉన్నప్పుడు హాట్‌స్టార్‌లో 4.3 కోట్ల మంది ఒకేసారి వీక్షించారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు ఉండగా తాజాగా ఆ రికార్డు బ్రేక్ అయ్యింది.
అంతక ముందు ఫిఫా ప్రపంచకప్ 2022 ఫైనల్ మ్యాచ్ ఉండేది. ప్రాన్స్, అర్జెంటీనా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను ఏకకాలంలో 3.2 కోట్ల మంది వీక్షకులు జియో సినిమాస్ ఫ్లాట్‌ఫామ్‌లో చూశారు. అప్పట్లో ఇది ఓ రికార్డు.
ఇదిలా ఉంటే.. ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లీ సెంచరీ చేసి సచిన్ రికార్డును సమం చేసిన తరువాత మైదానంలో ప్రేక్షకుల అరుపులతో దద్దరిల్లింది. 118 డెసిబెల్స్ సౌండ్ వచ్చింది. కాగా.. ఈ ప్రపంచకప్‌లో ఇంత శబ్ధంతో ఫ్యాన్స్ కేకలు పెట్టడం ఇదే తొలిసారి.
ఫ్రీ గా ప్రపంచకప్ మ్యాచులు..
వన్డే ప్రపంచకప్ మ్యాచులను ఉచితంగా చూసే అవకాశాన్ని డిస్నీ+హాట్ స్టార్ కల్పించింది. అంతక ముందు ఆసియా కప్ మ్యాచులను కూడా ఫ్రీగా స్ట్రీమింగ్ చేసింది. అయితే.. ఈ అవకాశం కేవలం మొబైల్లో మాత్రమే ఇచ్చింది. ల్యాప్‌ట్యాప్, డెస్క్‌టాప్, టీవీల్లో చూడాలంటే మాత్రం సబ్స్క్రిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాగా.. ఐపీఎల్ 2023 సీజన్‌ను జియో సినిమాస్‌లో ఉచితంగా ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.
ODI World Cup 2023 : అఫ్గానిస్థాన్ కొంప ముంచిన క్యాచ్.. లేదంటేనా..!