Airtel Unlimited 5G Data : హాట్‌స్పాట్ వాడేవారికి Airtel షాక్.. ఇకపై అన్లిమిటెడ్ 5G డేటా కట్.. కంపెనీ క్లారిటీ!
Airtel Unlimited 5G Data : మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా అన్ లిమిటెడ్ 5జీ డేటాను షేర్ చేయలేరని, 300GB ఫెయిర్ యూసేజ్ లిమిట్ వర్తిస్తుందని ఎయిర్టెల్ స్పష్టం చేసింది.
Airtel Unlimited 5G Data
- అన్లిమిటెడ్ 5G ప్లాన్ డేటా మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా షేర్ చేయలేరు
- కంపెనీ నిబంధనలు, షరతులకు సంబంధించి ఎయిర్టెల్ క్లారిటీ
- 5జీ డేటా షేరింగ్‌పై వినియోగదారుల ఫిర్యాదులు
Airtel Unlimited 5G Data : ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. ఇకపై అన్ లిమిటెడ్ 5జీ డేటాను ఇతర డివైజ్ లకు షేర్ చేయలేరు.. అన్ లిమిటెడ్ 5జీ డేటా షేరింగ్‌ను ఎయిర్టెల్ అధికారికంగా నిషేధించింది. అంటే.. ప్లాన్ యాక్టివేట్ చేసిన స్మార్ట్ ఫోన్లో మాత్రమే 5జీ డేటా మొత్తాన్ని వినియోగించుకోగలరు.
ఇదే విషయంలో ఎయిర్ టెల్ కూడా క్లారిటీ ఇచ్చింది. చాలామంది వినియోగదారులు తమ 5జీ డేటా ప్లాన్ మొబైల్ హాట్ స్పాట్ కనెక్ట్ చేయలేకపోతున్నామంటూ ఫిర్యాదు చేస్తున్నారు. హాట్‌స్పాట్ డేటా షేరింగ్ కోసం కస్టమర్లు అన్ లిమిటెడ్ 5G బెనిఫిట్స్ ఉపయోగించలేరని ఆ టెలికాం ఆపరేటర్ నిబంధనలు షరతులలో స్పష్టం చేసింది.
అన్ లిమిటెడ్ 5జీ ప్లాన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు ఇతర డివైజ్‌లలో కూడా ఇంటర్నెట్ షేరింగ్ చేసుకోవచ్చని చాలా మంది కస్టమర్లు భావించిన నేపథ్యంలో ఈ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఎయిర్టెల్ పాలసీ ప్రకారం.. అన్ లిమిటెడ్ 5జీ డేటా ఆఫర్ అర్హత గల సిమ్‌తో స్మార్ట్‌ఫోన్‌లో వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే. ఈ డేటాను మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా యాక్సెస్ చేయలేరు.
ఒకవేళ మీ ఫోన్లో మొబైల్ హాట్‌స్పాట్‌ను ఎనేబుల్ చేస్తే.. కనెక్ట్ చేసిన డివైజ్‌లకు వినియోగించే డేటా మీ అన్ లిమిటెడ్ డేటా నుంచి కాకుండా, మీ రెగ్యులర్ రోజువారీ డేటా ప్యాక్ కోటా నుంచి కట్ అవుతుంది.
ఎయిర్టెల్ ఫెయిర్ యూసేజ్ పాలసీ ప్రకారం.. చాలావరకూ ప్లాన్లలో అన్ లిమిటెడ్ 5G డేటా అందిస్తుందని భావిస్తుంటారు. వాస్తవానికి, కంపెనీ 30 రోజుల వ్యవధిలో 300GB యూసేజ్ లిమిట్ అందిస్తుంది. కమర్షియల్ లేదా మోసపూరిత వినియోగాన్ని నివారించేందుకు నిబంధనలను మార్చడం లేదా సవరించే హక్కు ఆపరేటర్‌కు ఉంటుంది.
అయితే, ఈ డేటా లిమిట్‌పై ఆన్లైన్లో చర్చలకు దారితీసింది. అన్లిమిటెడ్ డేటా బెనిఫిట్స్ నుంచి హాట్‌స్పాట్ వినియోగాన్ని ఎందుకు మినహాయించారని చాలా మంది వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
