Airtel Budget Plan : పండుగ చేస్కోండి.. ఎయిర్‌టెల్ అద్భుతమైన ప్లాన్ మీకోసం.. ఫ్రీ కాలింగ్, ఓటీటీ బెనిఫిట్స్.. 84 రోజులు ఎంజాయ్ చేయొచ్చు!

Airtel Budget Plan : ఎయిర్‌టెల్ సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ 84 రోజుల ప్లాన్ ద్వారా తమ వినియోగదారులకు ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు ఓటీటీ సబ్‌స్ర్కిప్షన్ కూడా అందిస్తోంది.

Airtel Budget Plan : పండుగ చేస్కోండి.. ఎయిర్‌టెల్ అద్భుతమైన ప్లాన్ మీకోసం.. ఫ్రీ కాలింగ్, ఓటీటీ బెనిఫిట్స్.. 84 రోజులు ఎంజాయ్ చేయొచ్చు!

Airtel Recharge Plan

Updated On : March 15, 2025 / 4:34 PM IST

Airtel Budget Plan : ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. అత్యంత సరసమైన ధరకే ప్రీమియం రీఛార్జ్ ప్లాన్ మీకోసమే.. దేశీయ రెండో అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ ఎయిర్‌టెల్ తమ కస్టమర్ బేస్ మరింత విస్తరించేందుకు ఈ అద్భుతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ తీసుకొచ్చింది.

Read Also : MG Cars Discounts : కొత్త కారు కావాలా? ఎంజీ ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ. 5 లక్షలపైనే తగ్గింపు.. నెవర్ బీఫోర్ ఆఫర్లు భయ్యా..!

సరసమైన ప్రీమియం రీఛార్జ్ ప్లాన్‌ అందిస్తోంది. వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు మారుమూల ప్రాంతాలలో కూడా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించేందుకు కంపెనీ ఎలన్ మస్క్ స్టార్‌లింక్‌తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించేందుకు ఎయిర్‌టెల్ ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌లతో OTT సబ్‌స్క్రిప్షన్‌లను కూడా ఆఫర్ చేస్తోంది. అంతేకాదు.. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ ద్వారా ఫ్రీ కాలింగ్, డేటా లిమిట్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్రీమియం రీఛార్జ్ ప్లాన్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి..

ఎయిర్‌టెల్ 84 రోజుల ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.1,199 ధరకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 84 రోజుల లాంగ్ టైమ్ వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ కస్టమర్లు అన్ని లోకల్, ఎస్టీడీ నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. అదనంగా, సబ్‌స్క్రైబర్‌లు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ పొందవచ్చు.

84 రోజులకు 210GB డేటా :
ఎక్కువ డేటా అవసరమయ్యే యూజర్లకు ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల పాటు 210GB డేటాను అందిస్తుంది. వినియోగదారులు రోజుకు 2.5GB డేటాను పొందవచ్చు. ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాలలో ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తుంది.

Read Also : Hero Splendor Plus : కొత్త బైకు భలే ఉంది భయ్యా.. సెక్యూరిటీ ఫీచర్లతో హీరో స్ప్లెండర్ ప్లస్ వచ్చేస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?

అమెజాన్ ప్రైమ్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ ఓటీటీ బెనిఫిట్స్ :
మీరు లేటెస్ట్ మూవీలు, వెబ్ సిరీస్‌లను ఎక్కువగా చూస్తుంటారా? అయితే, ఈ ప్లాన్ మీకోసమే. 84 రోజుల పాటు ఫ్రీ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. యూజర్లు విడిగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పనిలేదు. అయితే, ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ ఒక డివైజ్‌కు మాత్రమే పరిమితమని గమనించాలి.