Amazon Diwali Special Sale : అమెజాన్ దీపావళి స్పెషల్ సేల్.. టాప్ స్మార్ట్ టీవీలు, స్పీకర్లపై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Amazon Diwali Special Sale : అమెజాన్ దీపావళి ఫెస్టివల్ సేల్ సందర్భంగా అనేక టాప్ స్మార్ట్ టీవీలు, స్పీకర్ డీల్స్ అందిస్తోంది.

Amazon Diwali Special Sale
Amazon Diwali Special Sale : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కింద దీపావళి స్పెషల్ ఫేజ్‌ను ప్రకటించింది. ఈ ప్రత్యేక సేల్ సమయంలో 4K స్మార్ట్ టీవీలు, 5.1-ఛానల్ సౌండ్‌బార్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
పండుగ సీజన్‌కు ముందు హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌గ్రేడ్ (Amazon Diwali Special Sale) ప్లాన్ చేస్తుంటే ఈ సేల్ ఆఫర్లను అసలు మిస్ చేసుకోవద్దు. పాత ఫుల్ HD మోడళ్ల నుంచి 4K స్మార్ట్ టీవీలకు మారాలనుకున్నా సరౌండ్ సౌండ్ సెటప్ కోసం చేసే కొనుగోలుదారులకు సరైన సమయం.
అంతేకాదు.. GST సేవింగ్స్, బ్యాంక్ ఆఫర్‌లు, కూపన్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ సహా డిస్కౌంట్‌లతో వినియోగదారులు సాధారణ సీజనల్ డీల్స్ అందించే దానికంటే ఎక్కువ సేవ్ చేయవచ్చు. అమెజాన్ అందించే డీల్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ముందుగా అమెజాన్‌లో ఈ దీపావళి సేల్‌లో ఏయే ఆఫర్లు ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
అమెజాన్ దీపావళి స్పెషల్ సేల్ ఆఫర్లు :
ఇటీవలి జీఎస్టీ సవరణలో భాగంగా 32 అంగుళాల కన్నా ఎక్కువ టీవీలపై జీఎస్టీ 28శాతం నుంచి 18శాతానికి తగ్గింది. మీరు రూ.12వేల వరకు ధర తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ #GSTBachatUtsav అనే పేరుతో తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది.
ఈ సేల్‌లో ఇతర ఆఫర్లు :
18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ
ఎక్స్ఛేంజ్‌తో రూ. 20వేల వరకు తగ్గింపు
కూపన్‌తో రూ. 15వేల వరకు తగ్గింపు
65వేల వరకు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్
స్మార్ట్ టీవీ డీల్స్ :
వివిధ బ్రాండ్ల నుంచి 43-అంగుళాల 4K టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని మోడల్స్ QLED ప్యానెల్ కలిగి ఉన్నాయి. సాధారణంగా రిచ్ కలర్స్, మెరుగైన కాంట్రాస్ట్ కోసం స్టాండర్డ్ UHD ప్యానెల్‌ల కన్నా బెస్ట్ మోడల్స్‌గా చెప్పొచ్చు.
- టీసీఎల్ 43V6C 4K UHD టీవీ (43-అంగుళాలు) అసలు ధర రూ. 23,748, తగ్గింపు ధర రూ.18,490
- వియూ (Vu) 43GLOQLED25 4K QLED TV (43-అంగుళాల) అసలు ధర రూ. 23,029, తగ్గింపు ధర రూ.19,490
- Hisense 43E7Q 4K QLED టీవీ (43-అంగుళాల) అసలు ధర రూ. 25,507, తగ్గింపు ధర రూ. 19,749 (రూ. 500 కూపన్)
- లిమియో విజన్ 7 4K QLED టీవీ (43-అంగుళాల) అసలు ధర రూ. 29,156, తగ్గింపు ధర రూ. 21,499 (రూ. 1,000 కూపన్)
- షావోమీ L43MB-FPIN 4K క్యూఎల్ఈడీ టీవీ (43-అంగుళాలు) అసలు ధర రూ. 27,193, తగ్గింపు ధర రూ. 22,749
- ఏసర్ AR43QDXGU2875AT 4K క్యూఎల్ఈడీ టీవీ (43-అంగుళాల) అసలు ధర రూ. 28,529, తగ్గింపు ధర రూ. 22,749
- శాంసంగ్ UA43DUE77AKLXL 4K UHD TV (43-అంగుళాలు) అసలు ధర రూ. 29,926, తగ్గింపు ధర రూ. 22,990
- పానాసోనిక్ TH-43PX665DX 4K UHD TV (43-అంగుళాలు) అసలు ధర రూ. 27,481, తగ్గింపు ధర రూ. 24,300
- ఎల్‌జీ 43UA82006LA 4K UHD TV (43-అంగుళాల) అసలు ధర రూ. 32,828, తగ్గింపు ధర రూ. 26,740
- సోనీ బ్రేవియా 2M2 K-43S22BM2-2 4K UHD TV (43-అంగుళాలు) అసలు ధర రూ. 41,035, తగ్గింపు ధర రూ. 32,990
సౌండ్‌బార్ స్పీకర్ డీల్స్ :
ఈ కింది జాబితా చేసిన సౌండ్‌బార్‌లు 5.1 ఛానెల్స్‌కు సపోర్టు ఇస్తాయి. సినిమాలు, మ్యూజిక్, గేమ్‌లకు సరౌండ్ సౌండ్‌ను అందిస్తాయి.
- జెబ్రోనిక్స్ జెబ్-జూక్ బార్ (9500WS) అసలు ధర రూ.10,986, తగ్గింపు ధర రూ. 7,499
- బోట్ ఆవాంటే ప్రైమ్ (5000D) అసలు ధర రూ.11,079, తగ్గింపు ధర రూ. 8,999
- సోనీ HT-S20R అసలు ధర రూ.15,943, తగ్గింపు ధర రూ.12,591
- అల్టిమేయా పోసిడాన్ D60 అసలు ధర రూ. 25,026, తగ్గింపు ధర రూ.18,749
- ఎల్జీ S65TR అసలు ధర రూ. 22,349, తగ్గింపు ధర రూ. 20,740