Amazon Prime Day Sale 2025 : శాంసంగ్ లవర్స్‌కు పండగే.. అమెజాన్‌లో ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?
Amazon Prime Day Sale 2025 : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Amazon Prime Day Sale 2025
Amazon Prime Day Sale 2025 : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు (Amazon Prime Day Sale 2025) స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, PC, హోం అప్లియన్సెస్, వంటి కేటగిరీలో ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
శాంసంగ్ నుంచి గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ A55 5G వంటి అనేక స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారీగా తగ్గాయి. మీరు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, ఇతర ప్రొడక్టులపై అద్భుతమైన డీల్స్ పొందవచ్చు.
అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ అందించే అత్యంత ముఖ్యమైన డీల్స్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ ఒకటి.. గత ఏడాదిలో ఈ శాంసంగ్ ఫోన్ లాంచ్ కాగా అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో 12GB + 256GB ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 1,34,999కు లభిస్తోంది. కొనుగోలుదారులు అన్ని ఆఫర్‌లతో సహా రూ. 74,999 ధరకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్స్ :
అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఫోన్ ధరను మరింత తగ్గాలంటే ICICI బ్యాంక్ క్రెడిట్, SBI క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్‌పై రూ. 6,250 వరకు (10 శాతం) బ్యాంక్ డిస్కౌంట్లతో కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా శాంసంగ్ మొబైల్‌లపై కొన్ని బెస్ట్ డీల్స్ మీకోసం అందిస్తోంది. అవేంటో ఓసారి లుక్కేయండి..
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు ధరలివే :
- శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా : అసలు ధర రూ. 1,34,999 తగ్గింపు ధర రూ. 74,999
- శాంసంగ్ గెలాక్సీ A55 5G : అసలు ధర రూ. 42,999, తగ్గింపు ధర : రూ. 24,999
- శాంసంగ్ గెలాక్సీ M36 5G : అసలు ధర రూ. 22,999, తగ్గింపు ధర రూ. 16,499
- శాంసంగ్ గెలాక్సీ M16 5G : అసలు ధర రూ. 15,999, తగ్గింపు ధర రూ. 10,749
- శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 : అసలు ధర రూ. 1,64,999, తగ్గింపు ధర రూ. 1,49,999
- శాంసంగ్ గెలాక్సీ M56 5G : అసలు ధర రూ. 30,999, తగ్గింపు ధర రూ. 24,999
- శాంసంగ్ గెలాక్సీ M06 5G : అసలు ధర రూ. 12,499, తగ్గింపు ధర రూ. 7,999
- శాంసంగ్ గెలాక్సీ M05 5G : అసలు ధర రూ. 9,999, తగ్గింపు ధర రూ. 6,249