Amazon Prime Day Sale : ఏంది భయ్యా డిస్కౌంట్లు.. అమెజాన్‌లో అతి చౌకైన ధరకే ఐఫోన్ 17 ప్రో, శాంసంగ్ గెలాక్సీ S26 ఫోన్లు..!
Amazon Prime Day Sale 2026 : అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో, గెలాక్సీ ఎస్26, వన్‌ప్లస్ 15ఆర్ ఫోన్లపై భారీ తగ్గింపులతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్, ప్రైమ్ మెంబర్షిప్ ఆఫర్లు, మరెన్నో బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
Top Deals On iPhone 17 Pro, Samsung Galaxy S26
- అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 ఈరోజుతో ముగుస్తోంది
- ఐఫోన్ 17 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్26, వన్‌ప్లస్ 15ఆర్ ఫోన్లపై డిస్కౌంట్లు
- ప్రైమ్ డేలో టాప్ రేంజ్ ఫోన్ డీల్స్ అసలు వదులుకోవద్దు
Amazon Prime Day Sale 2026 : అమెజాన్ ప్రైమ్ డే 2026 మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఇందులో స్మార్ట్ఫోన్లు, హోం అప్లియన్సెస్, ఎలక్ట్రానిక్స్ అనేక ఇతర కేటగిరీలపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఈ సేల్ జూలై 4న ప్రారంభమై జూలై 6 వరకు కొనసాగుతుంది.
ఈ 3 రోజుల షాపింగ్ ఈవెంట్ సందర్భంగా ప్రైమ్ సభ్యులు ప్రత్యేక తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ (Amazon Prime Day Sale 2026) బెనిఫిట్స్ పొందవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలని చూస్తుంటే ఈ సేల్‌లో 3 అద్భుతమైన డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు.
ప్రైమ్ డేలో టాప్ రేంజ్ ఫోన్ డీల్స్ :
ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో ఫోన్ 256జీబీ వేరియంట్ ఇప్పుడు అసలు ధర రూ. 1,34,900 నుంచి రూ. 1,24,900 ధరకు లభిస్తోంది. శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ S26 5జీపై కూడా తక్కువ ధరకే అందిస్తోంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 87,999 నుంచి ఇప్పుడు రూ. 79,999 ధరకు లభిస్తుంది.
మరోవైపు, ఈ సేల్‌లో భారీగా ధర తగ్గిన ఫోన్లలో వన్‌ప్లస్ 15ఆర్ ఒకటి. 16జీబీ + 512జీబీ వేరియంట్ ఇప్పుడు రూ. 68,999 నుంచి రూ. 58,998 ధరకు అమ్ముడవుతోంది. ఈ సేల్ కేవలం వీరికి మాత్రమే అందుబాటులో ఉంది.
మీరు ప్రైమ్ సభ్యులు అయినా ఇంకా సభ్యులు కాని కస్టమర్లు ప్రైమ్‌కు సబ్స్క్రయిబ్ చేసుకుంటే అన్ని సేల్ ఆఫర్లను పొందవచ్చు. అమెజాన్ స్టాండర్డ్ ప్రైమ్ వార్షిక సభ్యత్వ ధర రూ. 1,499తో పోలిస్తే.. కొత్త కస్టమర్లు రూ. 999 తగ్గింపు ధరకే పొందవచ్చు. అంటే అదనంగా రూ. 500 డిస్కౌంట్ పొందవచ్చు.
రెగ్యులర్ ప్లాన్ కోసం ఏడాదికి రూ. 599 ధరతో ప్రైమ్ లైట్ ప్లాన్ తీసుకోవచ్చు. అదే ఏడాదికి రూ. 200 చెల్లించి ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ కూడా ఎంచుకోవచ్చు. ప్రైమ్ సభ్యులు చెక్అవుట్ సమయంలో అర్హత గల బ్యాంక్ కార్డులతో మరింత ఆదా చేసుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో చెల్లించే కస్టమర్లు కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు ఎంపిక చేసిన ప్రొడక్టులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, కొన్ని ప్రొడక్టులపై 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందవచ్చు. ఈ సేల్ సమయంలో మీకు నచ్చిన ఫోన్లను అత్యంత సరసమైన ధరకే కొనేసుకోవచ్చు.
