Apple iPhone 15 : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఇంతకన్నా తక్కువ ధరకు మళ్లీ దొరకదు!
Apple iPhone 15 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డీల్స్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ అమ్మకపు ధర రూ.67,999 కాగా, ఆఫర్ల తర్వాత ధర రూ.63,999కి తగ్గుతుంది.
Apple iPhone 15
- ఆపిల్ ఐఫోన్ 15 సేల్ ధర రూ.67,999
- ఆఫర్ల తర్వాత ధర రూ.63,999 వరకు తగ్గింపు
- A16 బయోనిక్ 48MP కెమెరా సెటప్
Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15పై ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 15 భారీ తగ్గింపు ధరకే అందిస్తోంది. ఐఫోన్ 15ను రూ.63,999 ధరకు ఇంటికి తెచ్చుకోవచ్చు. మీ దగ్గర పాత ఐఫోన్ ఉంటే మరింత తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ వంటి బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 సేల్ ధర రూ.67,999 మాత్రమే. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్లతో ధర రూ.63,999కి తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Apple iPhone 15) స్మార్ట్ఫోన్లతో పాటు ఇతర కేటగిరీలపై కూడా ఆఫర్లను అందిస్తోంది.
యాక్సిస్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై 10శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. సూపర్మనీతో ఫస్ట్ లావాదేవీపై 10శాతం తగ్గింపు, నో కాస్ట్ ఈఎంఐ, సూపర్‌కాయిన్స్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ల వంటి ఆప్షన్లు ఉన్నాయి.
ఐఫోన్ 15 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. :
ఇందులో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. రిజల్యూషన్ 2556×1179 పిక్సెల్స్, డైనమిక్ ఐలాండ్, హెచ్డీఆర్, ట్రూ టోన్లకు సపోర్ట్ చేస్తుంది.
స్క్రీన్ సాధారణ బ్రైట్నెస్ 1,000 నిట్స్, హెచ్‌డీఆర్‌లో టాప్ బ్రైట్నెస్ 1,600 నిట్స్ వరకు, బయట బ్రైట్నెస్ 2,000 నిట్స్ వరకు ఉంటుంది. ఈ ఫోన్లో A16 బయోనిక్ చిప్ అమర్చారు. 6-కోర్ సీపీయూ, 5-కోర్ జీపీయూ, 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి.
కెమెరాల విషయానికొస్తే.. ఐఫోన్ 15లో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ప్రైమరీ కెమెరా సెన్సార్-షిఫ్ట్ OISకు సపోర్ట్ చేస్తుంది, క్వాడ్-పిక్సెల్ సెన్సార్ 2x టెలిఫోటో షాట్లను కూడా తీయగలదు.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ట్రూడెప్త్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో USB టైప్-సి పోర్ట్, 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC ఫీచర్లు ఉన్నాయి. IP68 రేటింగ్ ఉంది ఐఫోన్ బరువు 171 గ్రాములు. స్టోరేజ్ ఆప్షన్లలో 128GB, 256GB, 512GB ఉన్నాయి.
