iPhone 16 Price : సూపర్ డిస్కౌంట్ బ్రో.. రూ.79,900 ఐఫోన్ 16 ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో.. డీల్ మిస్ అవ్వకండి!
iPhone 16 Price : ఆపిల్ ఐఫోన్ 16 భారీగా తగ్గింది. రూ. 79,900 విలువైన ఈ ఐఫోన్ మోడల్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 17,295 తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
iPhone 16 Price
- ఐఫోన్ 16లో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే
- 48MP వైడ్-యాంగిల్ కెమెరా, ఆపిల్ A18 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది
- బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై రూ.5,295 డిస్కౌంట్ పొందవచ్చు
iPhone 16 Price : ఆపిల్ ఐఫోన్ లవర్స్ మీకోసమే.. మీరు కొత్త ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. ఐఫోన్ 16 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ ఐఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో అదనంగా తగ్గింపు పొందవచ్చు. ఈ ఐఫోన్లో 48MP ప్రైమరీ కెమెరా, A18 చిప్సెట్ ఉన్నాయి. ఐఫోన్ 16 డిస్కౌంట్లు, ఆఫర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆపిల్ ఐఫోన్ 16 ధర, తగ్గింపు :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఈ-కామర్స్ సైట్లో రూ. 67,900కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్ విషయానికొస్తే.. ఫ్లిప్‌కార్ట్ (iPhone 16 Price) యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై రూ.5,295 డిస్కౌంట్ పొందవచ్చు. ఫైనల్ ధర రూ. 62,900 అవుతుంది.
అంతేకాదు.. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ధరను రూ. 49,850 వరకు తగ్గించవచ్చు. ఈ ఆఫర్ మీ పాత ఫోన్ ప్రస్తుత వర్కింగ్ కండిషన్ ఆధారంగా రేటు వాల్యూ ఉంటుంది. ఈ ఐఫోన్ సెప్టెంబర్ 2024లో రూ. 79,900కు లాంచ్ కాగా ఇప్పుడు రూ. 17,295 చౌకగా పొందవచ్చు.
Read Also : ITR Filing 2026 : రూ. 10 లక్షలకుపైగా కారు కొన్నారా? ITRలో TCS రీఫండ్ మిస్ అవ్వొద్దు! ఇలా క్లెయిమ్ చేయండి!
ఐఫోన్ 16 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16లో 1179×2556 పిక్సెల్స్ రిజల్యూషన్, 2000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఐఫోన్ ఆపిల్ A18 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఐఓఎస్ 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. IP68 రేటింగ్ కూడా ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఇ, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, సింగిల్ యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
ఆపిల్ ఐఫోన్ 16 బ్యాక్ సైడ్ ఎఫ్/1.6 అపర్చర్‌తో 48MP వైడ్-యాంగిల్ కెమెరా, ఎఫ్/1.6 అపర్చర్‌తో 12MP, 2x టెలిఫోటో కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/1.9 అపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. కొలతల పరంగా చూస్తే.. ఐఫోన్ 16 మోడల్ పొడవు 147.6 మి.మీ., వెడల్పు 71.6 మి.మీ, మందం 7.8 మి.మీ ఉంటుంది. ఈ ఐఫోన్ బరువు 170 గ్రాములు ఉంటుంది.
