Apple iPhone 17e : అద్భుతమైన ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ 17e ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..
Apple iPhone 17e : ఐఫోన్ ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17e ధర భారీగా తగ్గింది. ఇప్పుడు రూ. 15వేలు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
Apple iPhone 17e
- ఐఫోన్ 17eలో 48MP ఫ్యూజన్ కెమెరా, 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే
- ఫ్లిప్‌కార్ట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 3,245 బ్యాంక్ డిస్కౌంట్
- పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 49,650 వరకు తగ్గింపు
Apple iPhone 17e : సరసమైన కాంపాక్ట్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఐఫోన్ 17e భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు రూ. 15వేలు తగ్గింపు లభిస్తోంది. ఈ ఐఫోన్ మోడల్ 48MP కెమెరా, A19 చిప్సెట్ ఓఎల్ఈడీ ప్యానెల్ ఉన్నాయి. భారత మార్కెట్లో ఐఫోన్ 17e ధర ఎంత తగ్గిందో ఇప్పుడు చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17e ధర :
ఆపిల్ ఐఫోన్ 17e ధర రూ. 79,900 నుంచి ప్రారంభమవుతుంది. కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో పాత ధర రూ. 64,990కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 3,245 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ధర రూ. 62వేల కన్నా తక్కువకు పొందవచ్చు.
కొనుగోలుదారులు ఈ ఐఫోన్ నెలకు రూ. 22,212 ఈఎంఐ ద్వారా కూడా పొందవచ్చు. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్చేంజ్ ద్వారా రూ. 49,650 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, ఈ వాల్యూ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ 17e స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 17e మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్, 2532 × 1170-పిక్సెల్ రిజల్యూషన్ HDR కంటెంట్ కోసం 1,200 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ డిస్ప్లేకు యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా ఉంది.
Read Also : Kia PV7 : కియా PV7 వచ్చేసింది.. ఫ్యామిలీ ట్రిప్స్‌కు కొత్త ఛాయిస్.. 11 మంది వెళ్లొచ్చు!..
ఈ ఫోన్ ఆపిల్ A19 చిప్‌తో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 256GB లేదా 512GB స్టోరేజ్ కూడా ఉంది. ఈ చిప్‌సెట్‌లో 6-కోర్ సీపీయూ, నాలుగు-కోర్ జీపీయూ 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌తో పాటు ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది.
కెమెరాల విషయానికొస్తే.. :
ఐఫోన్ 17eలో f/1.6 అపర్చర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 48MP ఫ్యూజన్ రియర్ కెమెరా ఉంది. ఇన్-సెన్సార్ క్రాప్ ద్వారా 2x ఆప్టికల్-క్వాలిటీ జూమ్‌కు 10x వరకు డిజిటల్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ ఆటోఫోకస్‌తో 12MP ట్రూడెప్త్ కెమెరా ఉంది. ఈ రెండు కెమెరాలు 60fps వరకు 4K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.
ఈ ఐఫోన్ 169 గ్రాముల బరువు ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ సెరామిక్ షీల్డ్ 2 ఫ్రంట్ ఉన్నాయి. IP68 రేటింగ్ అందిస్తుంది. బ్లాక్, వైట్ సాఫ్ట్ పింక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
