Apple Offer: యాపిల్ బంపర్ ఆఫర్.. యూజర్లకు 20శాతం బోనస్
టెక్ దిగ్గజం యాపిల్ పేమెంట్స్ ను ప్రమోట్ చేసే దిశగా అడుగులేస్తుంది. యాపిల్ ఐడీ బ్యాలెన్స్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా జరపాలని ప్లాన్ చేస్తుంది.
- Subhan Ali Shaik
- Published On : October 17, 2021 / 08:49 PM IST
Apple’s Next Iphones
Apple Offer: టెక్ దిగ్గజం యాపిల్ పేమెంట్స్ ను ప్రమోట్ చేసే దిశగా అడుగులేస్తుంది. యాపిల్ ఐడీ బ్యాలెన్స్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా జరపాలని ప్లాన్ చేస్తుంది. యాపిల్ ఐడీకి మనీ యాడ్ చేసి ట్రాన్సాక్షన్లు జరిపే ఇండియన్ యూజర్లకు 20శాతం బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఇండియన్ యాపిల్ ఐడీ అకౌంట్ కు యాడ్ చేస్తే ఈ బెనిఫిట్ పొందొచ్చని ట్విట్టర్ లో ప్రకటించింది.
యాపిల్ చెప్పిన దాని ప్రకారం.. ఆఫర్ అక్టోబర్ 31వరకూ అందుబాటులో ఉంటుంది. రూ.100 నుంచి రూ.15వేల వరకూ యాడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు యాపిల్ ఐడీకి రూ.2వేలు యాడ్ చేస్తే రూ.400బోనస్ పొందొచ్చు. ఒకవేళ అమౌంట్ రూ.10వేలు యాడ్ చేస్తే రూ.2వేలు వస్తుందన్నమాట.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు అప్రూవల్ పొందాలని చెప్పింది. ఈ రికరింగ్ ట్రాన్సాక్షన్ల కోసం క్రెడిట్, డెబిట్ కార్డులు ముందుగా అప్రూవల్ పొందాలని అందులో పేర్కొంది.
……………………………………………………. : ఆ నాయకుని ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తాం : పవన్ కళ్యాణ్
కొత్త ఆదేశాల ప్రకారం.. ఆటో రెన్యూవబుల్ సబ్‌స్క్రిప్షన్‌తో లింక్ అయిన యాప్‌లపై ప్రభావం చూపనుంది. అందుకే డెవలపర్లు యాపిల్ ఐడీ బ్యాలెన్స్ ఉపయోగించి పేమెంట్స్ ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. యాప్ పర్చేజింగ్ ప్రక్రియలో ఇండియన్ యూజర్లను ప్రోత్సహించేందుకు 20శాతం బోనస్ ఇవ్వడం మంచి ఎంకరేజింగ్ కలిగించే విషయమని అంటున్నారు.
