Apply Pay UPI : అక్టోబర్‌లో భారత్‌కు ఆపిల్ పే సర్వీసు.. నో UPI సపోర్ట్.. ఐఫోన్ యూజర్లకు బెనిఫిట్ ఏంటి?
Apply Pay UPI : భారత్‌లో ఆపిల్ పే అందుబాటులోకి రానుంది. ఐఫోన్ యూజర్లు ఆపిల్ వాలెట్ ద్వారా నేరుగా క్రెడిట్ కార్డు పేమెంట్లు చేయవచ్చు. ప్రారంభంలో యూపీఐ సపోర్ట్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.
Apply Pay UPI
Apply Pay UPI : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు పండగే.. అతి త్వరలో భారతీయ ఐఫోన్ యూజర్ల కోసం కొత్త ఆపిల్ పే సర్వీసు రాబోతుంది. ఆపిల్ టెక్ దిగ్గజం పేమెంట్ సర్వీసును 2026 సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ ప్రారంభంలో భారత్‌లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే, ప్రారంభ దశలో ఆపిల్ పేకి యూపీఐ సపోర్ట్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.
భారతీయ యూజర్ల కోసం ఆపిల్ పే సర్వీసును ప్రధానంగా Visa, Mastercard నెట్‌వర్క్‌లపై జారీ చేసిన క్రెడిట్ కార్డుల కోసం తీసుకున్నట్టు సమాచారం. ఇందుకోసం ఆపిల్ ఇప్పటికే దేశంలోని ప్రముఖ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అర్హత ఉన్న క్రెడిట్ కార్డులను యూజర్లు ఆపిల్ వాలెట్ ద్వారా లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్, ఆపిల్ వాచ్ ద్వారా కాంటాక్ట్‌లెస్ పేమెంట్లు చేయవచ్చు.
ఆపిల్ పే సర్వీసు వస్తే.. :
ప్రతి పేమెంట్ సమయంలో కార్డు నంబర్, CVV, OTP వివరాలను మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫేస్ ఐడీ, టచ్ ఐడీ, టోకనైజేషన్ వంటి సేఫ్టీ బెనిఫిట్స్ ద్వారా పేమెంట్లు చేయవచ్చు. కార్డు వివరాలు బహిర్గతమయ్యే రిస్క్ కూడా తగ్గుతుంది.
అయితే, యూపీఐ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉండవచ్చు. యూపీఐ పేమెంట్లను ఆపిల్ పేలో అందించాలంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అలాగే స్పాన్సర్ బ్యాంక్ పార్టనర్ షిప్‌కూడా అవసరం. దీనికి సంబంధించిన ఫీజులపై ఆపిల్, భారతీయ బ్యాంకుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
Read Also : Jagtial Twins Adoption : తల్లి చనిపోయింది.. తండ్రి నిస్సహాయతే ఆసరా.. కవల శిశువుల దత్తత కలకలం
ఆపిల్ ఒక్కో లావాదేవీపై 15–20 బేసిస్ పాయింట్ల వరకు ఫీజు కోరుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు సుమారు 10 బేసిస్ పాయింట్లకు పరిమితం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రారంభంలో UPI, QR పేమెంట్లకు ఆపిల్ పే సపోర్టు ఉండదు. దేశంలోని యూపీఐ సిస్టమ్ పెద్దగా ఎఫెక్ట్ కాకపోవచ్చు. ప్రధానంగా NFC, POS టెర్మినల్స్, ఆన్లైన్ కార్డు పేమెంట్లు చేసే ఆపిల్ యూజర్లకు మాత్రమే పరిమితం కానుంది.
భారతీయ యూజర్లకు బెనిఫిట్ ఏంటి? :
ఐఫోన్లు, ఆపిల్ వాచ్‌లు, ఐప్యాడ్ల వంటి ఆపిల్ ప్రొడక్టులు వాడే యూజర్లకు ఆపిల్ పే అద్భుతమైన బెనిఫిట్ ఉంటుందని చెబుతున్నారు. కాంటాక్ట్‌లెస్ కార్డులతో మర్చంట్స్ పేమెంట్లు కూడా పెరుగుతాయి.
ఈ కొత్త విధానంతో ప్రతిసారీ కార్డ్ నంబర్లు, CVV, OTP టైప్ చేయాల్సిన పని ఉండదు. స్టోర్లు, యాప్‌లు, వెబ్సైట్లలో ఫాస్ట్ గా కేవలం ఒక్క ట్యాప్‌తో చెక్అవుట్ చేయొచ్చు. తద్వారా క్రెడిట్ కార్డ్ వాడకం ఇంకా పెరుగుతుందని అంటున్నారు.
మాన్యువల్ కార్డులతో పోలిస్తే టోకనైజేషన్, ఫేస్ ఐడీ, టచ్ ఐడీతో హై సెక్యూరిటీని అందిస్తుంది. తద్వారా కార్డ్ స్కిమ్మింగ్, ఫిషింగ్ రిస్క్ తగ్గుతుంది. ఆపిల్ పే యూపీఐ, క్యూఆర్ ఆధారిత పేమెంట్లకు సపోర్టు ఇవ్వకపోవచ్చు భారత యూపీఐ వ్యవస్థపై దీని ప్రభావం ఉండకపోవచ్చు. ఎన్ఎఫ్సీ పీఓఎస్ టెర్మినల్స్, కార్డ్ ఆధారిత ఆన్లైన్ లావాదేవీలకు మాత్రమే పరిమితం అవుతుంది.
