Urvashi Rautela – Lamborghini: ఊర్వశీ.. హైట్ ఉంటే సరిపోదు అంతేసి
తమిళ సినిమాల్లో రాణిస్తున్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా. చురకత్తుల్లాంటి చూపులతో.. మెరుపులను మరిపించే శరీర వన్నెతో.. హాట్‌గా.. స్వీట్‌గా.. నీట్‌గా ప్రతి ఒక్క అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునే ఊర్వశీ తనపై తానే సెటైర్ వేసుకుంది.
- Subhan Ali Shaik
- Published On : July 30, 2021 / 07:33 PM IST
Urvashi
Urvashi Rautela – Lamborghini: తమిళ సినిమాల్లో రాణిస్తున్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా. చురకత్తుల్లాంటి చూపులతో.. మెరుపులను మరిపించే శరీర వన్నెతో.. హాట్‌గా.. స్వీట్‌గా.. నీట్‌గా ప్రతి ఒక్క అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునే ఊర్వశి తనపై తానే సెటైర్ వేసుకుంది. ‘పొడుగ్గా ఉండేవాళ్లకు ఇలాంటి తిప్పలు తప్పవు మరి. నా లాంబొర్గినీ నుంచి బయటకు వచ్చేందుకు కష్టపడాల్సి వచ్చింది’ అంటూ పోస్టు చేసింది.
Lamborghini Huracanలో నుంచి బయటకు వచ్చేందుకు కష్టపడింది కానీ, అది ఆమె సొంతమా అనేది కన్ఫామ్ కాలేదు. ఇటీవల ‘ద లెజెండ్’ అనే భారీ ప్రాజెక్టులో నటిస్తున్నట్లుగా వార్తలు రాగా.. ఆ సెట్ కు సంబంధించిన కార్ కూడా అయి ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ Lamborghini Huracanలో కనిపించని ఊర్వశి తొలిసారి ఇలా కనపడింది. పైగా ఆ కార్ రిజిష్ట్రేషన్ నెంబర్ కూడా బయటపెట్టలేదు.
సూపర్ కార్స్, స్పోర్ట్స్ కార్స్ కు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కువగా ఉండాలని తక్కువ హైట్ తో రెడీ చేస్తారు. పైగా వాటి పైన కూడా ఎరో డైనమిక్స్ షేప్‌లో సిద్ధం చేయడానికి కారణం స్పీడ్ గా వెళ్లేటప్పుడు ఆకారం కారణంగా వేగం తగ్గకుండా ఉండాలని. కార్ లో నుంచి బయటకు రావడానికి ఊర్వశి మాత్రమే కాదు పొడుగ్గా ఉండేవాళ్లు ప్రతిఒక్కరికీ ఈ తిప్పలు తప్పవు.
ఊర్వశి ఎత్తు 178 సెం.మీలు అంటే 5అడుగుల 10 అంగుళాలు. సగటు భారత మహిళలు ఉండే ఎత్తుకంటే ఎక్కువగా ఉన్నట్లే. కాకపోతే అంత పెద్ద ఎత్తు ఉన్నట్లేమీ కాదు. దీనిపై నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు అంత హైట్ ఉంటే సరిపోదు. కార్ దిగడం తెలియాలని కొందరంటుంటే.. హైట్ ఉన్న కార్ తీసుకోవాల్సింది అంటూ మరి కొందరు ఉచిత సలహాలిస్తున్నారు.
