Vivo T4 Pro : వివో అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో T4 ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Vivo T4 Pro : వివో ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బచత్ డేస్ సేల్ సందర్భంగా వివో T4 ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Vivo T4 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బచత్ డేస్ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు తక్కువ ధరకే వివో T4 ప్రో కొనేసుకోవచ్చు.

ఈ సేల్ సమయంలో హై-పర్ఫార్మెన్స్ అందించే వివో T4 ప్రో 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ వివో ఫోన్ కొనుగోలుపై అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని డీల్స్, డిస్కౌంట్ల గురించి ఓసారి లుక్కేయండి.

వివో T4 ప్రో 5జీ ధర, ఆఫర్లు : 8జీబీ + 128GB (నైట్రో బ్లూ) కలర్ వేరియంట్ ధర రూ. 34999తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డేస్ సేల్ సమయంలో 14శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ధర రూ. 29,999కి తగ్గుతుంది. ఈ వివో ఫోన్ కొనుగోలుపై రూ. 5వేల వరకు సేవ్ చేసుకోవచ్చు.

మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ కోసం ప్లాన్ చేస్తుంటే.. పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ బట్టి రూ. 28750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లలో HDFC, Axis, SBI క్రెడిట్ కార్డులపై రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు. రూ. 4500 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో ఆర్డర్ చేయవచ్చు.

వివో T4 ప్రో డిస్ప్లే, ప్రాసెసర్ : ఈ మిడ్-రేంజ్ వివో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల ఫుల్ HD+ క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 5000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్లో లభిస్తుంది. స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం ఈ వివో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది.

కెమెరా, వీడియో క్వాలిటీ : ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఫీచర్ల పరంగా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. మెయిన్ కెమెరా OIS సపోర్టుతో 50MP, సెకండరీ కెమెరా కూడా 50MP, థర్డ్ కెమెరా 2MP సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6500mAh బ్యాటరీ, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ అందిస్తుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, Wi-Fi, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
