Google Pixel 10a : ఏంది భయ్యా డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10a మరి ఇంత తక్కువా? ఫ్లిప్‌కార్ట్‌లో ధర జస్ట్..
Google Pixel 10a : గూగుల్ పిక్సెల్ 10a తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన ఆఫర్ ద్వారా రూ. 8వేల కన్నా తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ కిర్రాక్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
Google Pixel 10a
- అక్టోబర్ 9వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం
- ఈ సేల్ సమయంలో గూగుల్ పిక్సెల్ 10aపై భారీ తగ్గింపు ఆఫర్
- గూగుల్ పిక్సెల్ 10a గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది
Google Pixel 10a : పిక్సెల్ ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 సందర్భంగా పిక్సెల్ 10a ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. మీరు రూ.45వేల లోపు కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. గూగుల్ పిక్సెల్ 10a అద్భుతమైన ఆప్షన్. ఈ పండుగ సీజన్ సేల్, బ్యాంక్ ఆఫర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో భారీ తగ్గింపు పొందవచ్చు. పిక్సెల్ 10aపై డీల్స్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
పిక్సెల్ 10a ధర ఆఫర్లు :
గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ 8GB/256GB స్టోరేజ్ వేరియంట్ రూ.47,999 ధరకు లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 2026 ఫిబ్రవరిలో రూ.49,999 ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ.6,200 తగ్గింపుతో బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. తద్వారా ధర రూ.41,799కి తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారుగా రూ.8,200 తక్కువకే లభిస్తోంది.
గూగుల్ పిక్సెల్ 10ఎ స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 10ఎ ఫోన్ 6.3-అంగుళాల pOLED డిస్ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 1080×2424 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. గూగుల్ టెన్సర్ జీ4 చిప్సెట్ టైటాన్ M2 సెక్యూరిటీ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది.
ఈ గూగుల్ ఫోన్ సేఫ్టీ కోసం ఫింగర్‌ప్రింట్ లాక్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు కూడా అందిస్తుంది. ఎఫ్/1.7 అపర్చర్ OIS సపోర్ట్‌తో 48MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం పిక్సెల్ 10ఎలో ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,100mAh బ్యాటరీతో పాటు 30W వైర్డ్ 10W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. పిక్సెల్ 10ఎ ఫోన్ పొడవు 153.9mm, వెడల్పు 73mm, మందం 9mm, బరువు 183 గ్రాములు ఉంటుంది.
