Google Pixel 11 Launch : పిక్సెల్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఖతర్నాక్ ఫీచర్లతో కొత్త పిక్సెల్ 11 ఫోన్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?
Google Pixel 11 Launch : గూగుల్ పిక్సెల్ 11 వచ్చే నెల 12న లాంచ్ కాబోతుంది. రాబోయే ఈ పిక్సెల్ 11 ఫోన్‌కు సంబంధించి స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ఎలా ఉండనున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Google Pixel 11 Launch
Google Pixel 11 Launch : పిక్సెల్ అభిమానులకు పండగే.. గూగుల్ పిక్సెల్ బ్రాండ్ నుంచి మరో సరికొత్త ఫోన్ రాబోతుంది. ఆగష్టు 12, 2026న ‘మేడ్ బై గూగుల్’ హార్డ్‌వేర్ ఈవెంట్ జరుగనుంది. ఈ సందర్భంగా టెక్ దిగ్గజం అదిరిపోయే ఫీచర్లతో పిక్సెల్ 11 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించనుంది.
ఈ ఏడాదిలో నెక్స్ట్ జనరేషన్ పిక్సెల్ స్మార్ట్ఫోన్లను సాధారణ షెడ్యూల్ కన్నా కొంచెం ముందుగానే లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. టిప్‌స్టర్ లీక్‌ల ప్రకారం.. పిక్సెల్ 11 లైనప్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో XL ఫోన్లతో పాటు పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ కూడా ఉండవచ్చని సూచిస్తున్నాయి.
గూగుల్ పిక్సెల్ 11 స్పెసిఫికేషన్లు (అంచనా) :
కొత్త పిక్సెల్ 11 ఫోన్ ప్రాసెసర్‌తో వచ్చే ఛాన్స్ ఉంది. టెన్సర్ G6 ప్రాసెసర్డీల్ల్యాబ్స్ మ్యాగజైన్ ప్రకారం.. ఈ ప్రాసెసర్ టీఎస్ఎంసీ అత్యాధునిక 2nm ప్రాసెస్ ఆధారంగా ఉంటుందని అంచనా. ఈ టెక్ దిగ్గజం బేస్ 128జీబీ వేరియంట్‌ను నిలిపివేయాలని చూస్తోంది.
అదే నిజమైతే.. ప్రతి గూగుల్ పిక్సెల్ 11 మోడల్ 256జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే ఛాన్స్ ఉంది. గూగుల్ ఈ ఏడాదిలో నెక్స్ట్ జనరేషన్ పిక్సెల్ డివైజ్‌ల కోసం కొత్త కలర్ ప్యాలెట్ కూడా తీసుకురానుందని లీక్‌లు సూచిస్తున్నాయి. స్టాండర్డ్ పిక్సెల్ 11 ఫోన్ ఫ్యూషియా, లైట్ స్టెర్లింగ్, మాస్, మిడ్నైట్ హేజ్ కలర్ ఆప్షన్లలో మార్కెట్లోకి రావచ్చు.
డిస్ప్లే పరంగా చూస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 3100 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల ఓఎల్ఈడీ ప్యానెల్ ఉండవచ్చు. అంతేకాదు.. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో రావొచ్చు.
కెమెరాల విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. ఇందులో 50ఎంపీ ప్రైమరీ లెన్స్, 48ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 12ఎంపీ టెలిఫోటో షూటర్ ఉండవచ్చు.
వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం 12ఎంపీ నుంచి 32ఎంపీ లెన్స్‌తో వచ్చే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే.. భారత మార్కెట్లో స్టాండర్డ్ గూగుల్ పిక్సెల్ 11 ఫోన్ ధర రూ. 79,990 నుంచి రూ. 84,999 మధ్య లాంచ్ అవుతుందని అంచనా.
