Google Pixel 9a : ఇది కదా ఆఫర్ అంటే.. గూగుల్ పిక్సెల్ 9a అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే? డోంట్ మిస్!

Google Pixel 9a : ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9ఎ ధర భారీగా తగ్గింది. ఏకంగా రూ.10వేల డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 9a : ఇది కదా ఆఫర్ అంటే.. గూగుల్ పిక్సెల్ 9a అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే? డోంట్ మిస్!

Google Pixel 9a

Updated On : November 4, 2025 / 5:49 PM IST

Google Pixel 9a : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. క్లీన్ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్, బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ కలిగిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? గూగుల్ పిక్సెల్ 9a అతి తక్కువ ధరకే కొనేసుకోండి. గూగుల్ పాపులర్ పిక్సెల్ లైనప్‌లో ఈ పిక్సెల్ 9a ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10వేల తగ్గింపుతో అందుబాటులో ఉంది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ డీల్స్‌లో ఇదొకటి. అద్భుతమైన డిజైన్, మెరుగైన పర్ఫార్మెన్స్, ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ (Google Pixel 9a) అందిస్తుంది. పిక్సెల్ 9a ఫోన్ సరసమైన ధరకు ఫ్లాగ్‌షిప్-లెవల్ ఫీచర్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9a డిస్కౌంట్ ఆఫర్‌ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పిక్సెల్ 9ఎ ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ ధర రూ.49,999కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పిక్సెల్ ఫోన్ ప్రస్తుతం రూ.44,999కు లిస్ట్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ పిక్సెల్ 9ఎ పై రూ.5వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాదు.. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.5వేలు తగ్గింపును పొందవచ్చు.

Read Also : Post Office Scheme : మీకు ఈ నెల జీతం పడిందా? పోస్టాఫీసులో ఇలా పెట్టుబడి పెట్టండి.. జస్ట్ 5 ఏళ్లలోనే లక్షాధికారి అయిపోవచ్చు..!

పిక్సెల్ 9a స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 6.3-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 422.2 పీపీఐ వద్ద ఫుల్ HD+ (1080 x 2424 పిక్సెల్స్) రిజల్యూషన్‌ కలిగి ఉంది. అలాగే, డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఇంకా, డిస్‌ప్లే HDR కంటెంట్ కోసం 1800 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ లెవల్స్, 2700 నిట్స్ వద్ద టాప్ లెవల్స్ అందిస్తుంది.

హుడ్ కింద, పిక్సెల్ 9a గూగుల్ టెన్సర్ G4 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 5100mAh బ్యాటరీతో వస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 9a బ్యాక్ సైడ్ 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 13MP కెమెరా కలిగి ఉంది.