HMD 105 4G School Edition : పిల్లల చేతిలో సేఫ్ ఫోన్.. 15 రోజుల బ్యాటరీతో HMD కొత్త స్కూల్ ఎడిషన్.. ధర జస్ట్ ఎంతంటే?
HMD 105 4G School Edition : పిల్లల కోసం హెచ్ఎండీ 105 4జీ స్కూట్ ఎడిషన్ ఫీచర్ ఫోన్ లాంచ్ అయింది. పేరెంటల్ కంట్రోల్స్, బ్రౌజర్ లేకపోవడం, 15 రోజుల బ్యాటరీ, IP54 రేటింగ్ వంటి ఫీచర్లతో అద్భుతంగా ఉంది.
HMD 105 4G School Edition
- ఇంటర్నెట్కు దూరంగా.. పేరెంట్స్‌కు దగ్గరగా
- చదువుపై ఫోకస్.. డిస్ట్రాక్షన్కు చెక్.. HMD కొత్త ఫీచర్ ఫోన్
- పిల్లల చేతిలో సేఫ్ ఫోన్.. బ్రౌజర్ లేదు, రికార్డింగ్ లేదు
HMD 105 4G School Edition : మీ పిల్లలు ఫోన్ అదేపనిగా చూస్తున్నారా? చదవడం కన్నా ఫోన్ చూడటంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారా? అయితే, మీ పిల్లల కోసం కొత్త ఫోన్ వచ్చేసింది. ఇకపై ఈ ఫోన్ మీ పిల్లలకు ఇచ్చిన ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ కన్నా ఈ ఫీచర్ ఫోన్ చాలా బెటర్. పిల్లల చేతుల్లో ఫోన్ ఉన్నా సోషల్ మీడియా, వెబ్ బ్రౌజింగ్ వంటి డిస్ట్రాక్షన్స్ మాత్రం ఉండదు.
పేరెంట్స్ కోసం హెచ్ఎండీ కంపెనీ ఈ కొత్త ఫీచర్ ఫోన్‌ను తీసుకొచ్చింది. అదే హెచ్ఎండీ 105 4జీ స్కూల్ ఎడిషన్. పేరుకు (HMD 105 4G School Edition) తగ్గట్టుగానే ఈ ఫోన్‌ను స్కూల్ పిల్లలను దృష్టిలో పెట్టుకుని కంపెనీ డెవలప్ చేసింది. ఇందులో వెబ్ బ్రౌజర్ ఉండదు. కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా పేరెంట్స్‌తో కనెక్ట్ అవ్వొచ్చు. ఎంటర్టైన్మెంట్ కోసం సింగిల్ స్నేక్ గేమ్ మాత్రమే ఉంది. రికార్డింగ్ ఫంక్షన్‌ను కూడా ఇందులో లేదు.
పేరెంట్స్ చేతిలో కంట్రోల్ :
ఈ ఫోన్లోని పేరెంటల్ కంట్రోల్స్‌కు PIN ప్రొటెక్షన్ అందిస్తుంది. అవసరమైతే పేరెంట్స్ బ్లూటూత్, ఎంఎంఎస్, ఎఫ్ఎమ్ రేడియో వంటి ఫీచర్లను కూడా డిసేబుల్ చేయవచ్చు. అంటే పిల్లలకు అవసరమైన కమ్యూనికేషన్ అందిస్తుంది. అనవసరమైన ఫీచర్లకు దూరంగా ఉంచొచ్చు.
చిన్న ఫోన్.. లాంగ్ బ్యాటరీ :
హెచ్ఎండీ 105 4జీ స్కూల్ ఎడిషన్ ఫోన్ 2.4-అంగుళాల 240×320 పిక్సెల్ డిస్ప్లే, 64MB ర్యామ్, 128MB స్టోరేజ్ ఉన్నాయి. microSD కార్డుతో స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు. 1,450mAh రిమూవబుల్ బ్యాటరీతో పాటు స్టాండ్బైలో 15 రోజుల వరకు వర్క్ అవుతుందని హెచ్ఎండీ చెబుతోంది.
4జీ కనెక్టివిటీ, బ్లూటూత్ 5.0, USB-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. అదనంగా IP54 రేటింగ్ ఉండటం ఫోన్ మన్నికకు ప్లస్. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో సియాన్ కలర్లో ఈ ఫీచర్ ఫోన్ లిస్ట్ అయింది. అయితే, హెచ్ఎండీ ఈ ధరను ఇంకా వెల్లడించలేదు.
