Instagram Make Money
Instagram Influencers: ఇన్‌స్టాగ్రామ్ పేరు వినగానే గుర్తొచ్చే పేరు ఫొటోలు ఆ తర్వాత లైకులు. బాగా నచ్చితే షేరింగులు. కాంపిటీటివ్ ప్రపంచంలో సోషల్ మీడియా ప్రభావం చూపించినంతగా ప్రస్తుత మీడియా మరేదీ రాణించడం లేదు. ఈ పుణ్యమా అని బోలెడు మంది లక్షలు, కోట్లలో సంపాదించుకుంటున్నారని మీకు తెలుసా.. కేవలం సెలబ్రిటీలే కాదు సాధారణ ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా ఫాలోవర్లను బట్టి డబ్బు సంపాదన ఉంటుంది.
పర్‌ఫెక్ట్ పోస్టులు పెట్టి.. ఎప్పుడూ సోషల్ మీడియాతో అందుబాటులో ఉండే వారు నిజంగా డబ్బులు సంపాదిస్తారా అనే సందేహాన్ని క్లియర్ చేశారు హైప్ ఆడిటర్. మొత్తం 1865 ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్లపై సర్వే నిర్వహించి వారికి ఆదాయం ఎలా వస్తుందనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. దానికి వారు కేటాయించే సమయం, వర్క్ లోడ్ గురించి కనుగొనే ప్రక్రియలో 45.74శాతం మంది మహిళలు ఉండగా 25 నుంచి 34ఏళ్ల మధ్యలో ఉన్న వారు 28శాతం ఉన్నారట.
సోషల్ మీడియా అకౌంట్ రెవెన్యూను డాలర్లలో లెక్కిస్తారు. అలా చూస్తే యావరేజ్ ఇన్‌ఫ్లూయెన్సర్ నెలకు 2వేల 970డాలర్లు సంపాదిస్తున్నారట. అది కూడా ఫాలోవర్ల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. 1000 నుంచి 10వేల మంది ఫాలోవర్ల మధ్యలో ఉంటే వెయ్యి 420 డాలర్లు సంపాదించుకోవచ్చు. పది లక్షలకు మించి ఫాలోవర్లు ఉంటే 15వేల 356డాలర్ల సంపాదన వచ్చిపడుతుంది.
…………………………………………. : పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటేనే ఈ సినిమా చేశాను : క్రిష్
వెయ్యి నుంచి 10వేల ఫాలోవర్ల మధ్యలో ఉన్నవారు 22.99శాతం మంది తెలియకో.. ఇష్టం లేకో డబ్బు సంపాదించే దారిలో వెళ్లడం లేదట.
యావరేజ్ ఇన్‌ఫ్లూయెన్సర్ కు గంటకు 31డాలర్లు వస్తుంటే.. ఒక బ్యూటీ స్పెషలిస్ట్ పెట్టే పోస్టుకు గంటకు 60డాలర్ల కంటే ఎక్కువే వస్తుందట. అంటే దీనిని బట్టి చూస్తే సంపాదన కేటగిరీ బట్టి కూడా ఉంటుందని తెలిసింది. కొందరు సెలబ్రిటీలు గంటకు 187డాలర్లు వెనకేసుకుంటున్నారు. యానిమల్స్, బిజినెస్, మార్కెటింగ్, ఫిట్‌నెస్, స్పోర్ట్ మీద ఎక్కువగా సంపాదించొచ్చని తెలిసింది.
ఈ క్రమంలో బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసే పోస్టులకు 40.15శాతం మంది అధికంగా సంపాదిస్తున్నారని తెలిసింది. విదేశాల్లో ఉండే యూజర్లు టిక్ టాక్ ప్లాట్ ఫాంపైనా సంపాదిస్తున్నారు.