Apple iPhone 17 Pro : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఐఫోన్ 17 ప్రో వచ్చేస్తోందోచ్.. లాంచ్ డేట్, ధర, డిజైన్, కెమెరా, స్పెసిఫికేషన్లు ఇవే..!

Apple iPhone 17 Pro : సెప్టెంబర్ 2025లో ఐఫోన్ 17 సిరీస్‌లో 4 మోడళ్లు ఉంటాయి. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు, స్పెషిఫికేషన్లు వివరాలు ఉన్నాయి.

Apple iPhone 17 Pro : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఐఫోన్ 17 ప్రో వచ్చేస్తోందోచ్.. లాంచ్ డేట్, ధర, డిజైన్, కెమెరా, స్పెసిఫికేషన్లు ఇవే..!

Apple iPhone 17 Pro

Updated On : August 17, 2025 / 12:13 PM IST

Apple iPhone 17 Pro : ఆపిల్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ అతి త్వరలో లాంచ్ కానుంది. ఈ సిరీస్ లాంచ్ సెప్టెంబర్ 2025లో జరిగే (Apple iPhone 17 Pro) అవకాశం ఉంది. ఇందులో ఆపిల్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ నాలుగు ఫోన్లు రాబోతున్నాయి.

గత సిరీస్‌లో ఐఫోన్ 16 ప్రో బెస్ట్ సెల్లర్‌గా నిలిస్తే.. ఐఫోన్ 17 ప్రోపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లీక్‌లు, పుకార్లను పరిశీలిస్తే అద్భుతమైన ఫీచర్లతో ఐఫోన్ 17 ప్రో రాబోతుందని సూచిస్తున్నాయి. ఐఫోన్ లీక్ వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

భారత్‌లో ఐఫోన్ 17 ప్రో లాంచ్ డేట్, కలర్ ఆప్షన్లు, ధర :
ఈ ఆపిల్ ఐఫోన్ సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 10, 2025 మధ్య లాంచ్ అవుతాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఇటీవలి లీక్ ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ 4 ఫోన్లలో సెప్టెంబర్ 9, 2025న అంతర్జాతీయ, భారతీయ మార్కెట్‌లో అరంగేట్రం చేస్తాయని పేర్కొంది.

Read Also : Infinix Hot 60i 5G : కొత్త ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G ఆగయా.. AI ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనాల్సిందే.. ధర ఎంతో తెలుసా?

ఐఫోన్ 17 ప్రో కూడా బ్లాక్, యాష్ కలర్, వైట్, ఆరెంజ్, బ్రైట్ బ్లూ 5 వేర్వేరు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ధరల విషయానికొస్తే.. ఈ ఐఫోన్ 17 ప్రో రూ. 1,45,900 ప్రారంభ ధరకు లాంచ్ కానుంది.

ఐఫోన్ 17 ప్రో డిజైన్, కెమెరా, స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో డిజైన్ పరంగా అనేక మార్పులతో రానుంది. రెక్టాంగ్యులర్ కెమెరా ఐలాండ్‌ కలిగి ఉంటుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌‌తో రానుంది. ఆపిల్ లోగో కూడా కొద్దిగా జరగనుంది. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో 48MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 48MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుందని భావిస్తున్నారు.

బెస్ట్ సెల్ఫీ షాట్‌, వీడియో కాల్స్ కోసం ఈ ఐఫోన్ 24MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. డిస్‌ప్లే పరంగా ఐఫోన్ 17 ప్రోలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల ప్రోమోషన్ OLED ప్యానెల్‌ ఉండొచ్చు. 12GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆపిల్ A19 ప్రో చిప్‌సెట్‌ను అందిస్తుంది. మొత్తం మీద లీక్‌లను పరిశీలిస్తే.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో పవర్‌హౌస్‌గా రాబోతుంది.