New IRCTC Website : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కొత్త IRCTC వెబ్సైట్లో కొత్త ID అవసరమా? లాగిన్ ఎలా? ఫుల్ ప్రాసెస్!
New IRCTC Website : ఆన్లైన్ రైల్వే రిజర్వేషన్ల కోసం భారతీయ రైల్వే కొత్త IRCTC వెబ్సైట్ బీటా వెర్షన్‌ను ప్రారంభించింది. పూర్తి వెర్షన్ రాబోయే వారాల్లో అందుబాటులోకి వస్తుంది. పూర్తి వివరాలివే..
New IRCTC Website
- ఆన్లైన్ రిజర్వేషన్ల కోసం భారతీయ రైల్వే కొత్త వెబ్సైట్ బీటా వెర్షన్
- కొత్త వెబ్సైట్ కొత్త ఫీచర్లు, మెరుగైన యూజర్ ఇంటర్ఫేస్తో అప్డేట్
- ప్రస్తుతం టెస్టింగ్‌లో కొత్త IRCTC వెబ్సైట్ బీటా వెర్షన్
New IRCTC Website : రైల్వే ప్రయాణికులకు బిగ్ అప్డేట్.. IRCTC కొత్త వెబ్సైట్ బీటా వెర్షన్ ప్రారంభమైంది. ఈ కొత్త వెబ్సైట్ పాత టికెట్ బుకింగ్ వెబ్సైట్ కన్నా ఎక్కువ ఫీచర్లతో వస్తుంది. అంతేకాదు.. ఇందులో యూజర్ ఇంటర్ఫేస్ కూడా అప్‌గ్రేడ్ చేశారు. కొత్త కలర్ థీమ్‌ను వాడారు. పాత ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను 2002లో ప్రారంభించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఈ రైల్వే రిజర్వేషన్ వెబ్‌సైట్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేశారు.
కొత్త IRCTC వెబ్సైట్లో లాగిన్ ఎలా? :
- కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్లో లాగిన్ కోసం మీరు (irctc.co.in)ను విజిట్ చేయాలి.
- హోమ్ పేజీ టాప్‌లో బీటా వెర్షన్ ఓపెన్ చేయగానే మీకో బ్యానర్ కనిపిస్తుంది
- ఈ బ్యానర్‌పై క్లిక్ చేస్తే కొత్త బీటా వెర్షన్ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతారు.
- హోమ్ పేజీలోనే రిజర్వేషన్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు
- మీరు హోమ్ పేజీలోనే సీట్లు ఎన్ని ఉన్నాయో చెక్ చేయొచ్చు
- మీకు PNR స్టేటస్, రైలు షెడ్యూల్ సంబంధించి పూర్తి సమాచారం తెలుస్తుంది.
- వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే పైన కనిపించే లాగిన్ బటన్ ట్యాప్ చేయాలి.
- ఆ తర్వాత, ఐఆర్సీటీసీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి.
- మీరు కొత్త వెబ్సైట్లోకి లాగిన్ అవ్వగలరు.
- కొత్త యూజర్ అయితే లాగిన్ పేజీలో ‘Create ID’ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి.
- కొత్త యూజర్ ఐడీని క్రియేట్ చేసుకుని కొత్త వెబ్సైట్లో లాగిన్ అవ్వొచ్చు.
పాత ఐడీ వర్క్ అవుతుందా? :
అవును.. కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్లో లాగిన్ కోసం మీ పాత ఐడీ, పాస్‌వర్డ్‌ను వాడొచ్చు. కొత్త యూజర్ ఐడీని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీ పాత ఐఆర్సీటీసీ ఐడీని వాడి RailOne యాప్‌లోకి ఎలాగైతే లాగిన్ అవుతారో అలాగే కొత్త వెబ్సైట్లోకి కూడా మీ పాత ఐడీతో లాగిన్ అవ్వొచ్చు. అయితే, మీ ఐడీ మీ ఆధార్‌కు లింక్ అయి ఉండాలి.
OTPతో అథెంటికేషన్ పూర్తి చేయాలి. కొత్త వెబ్సైట్లో లాగిన్ అయ్యాక మీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. పాత వెబ్సైట్ మాదిరిగానే కొత్త IRCTC వెబ్సైట్ బీటా వెర్షన్లోనూ టిక్కెట్ బుకింగ్ చేయొచ్చు. అయితే, ఈ బీటా వెర్షన్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. వినియోగదారుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.
