Huawei Pura X View : స్టూడెంట్స్, గేమర్స్‌కి సూపర్ ఛాయిస్.. టాబ్లెట్ డిస్ప్లేతో కొత్త హువావే ఫోన్.. ప్రీ-ఆర్డర్లు స్టార్ట్!
Huawei Pura X View : హువావే పురా ఎక్స్ వ్యూ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్లు ముందుగానే ప్రారంభమయ్యాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. గేమర్లు, విద్యార్థులకు సరైన ఫోన్ ఇది..
Huawei Pura X View
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,500 నిట్స్ టాప్ బ్రైట్నెస్ డిస్ప్లే
- 50MP ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్
- 7,000 mAh బ్యాటరీ, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్
Huawei Pura X View : హువావే ఫ్యాన్స్ మీకోసమే.. కొత్త హువావే పురా ఎక్స్ వ్యూ ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ చూసేందుకు అచ్చం టాబ్లెట్ మాదిరి డిస్ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ భారీ డిస్ ప్లే కారణంగా గేమర్లకు, విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది.
ఈ ఫోన్ 7,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులోని డిస్ప్లే టాప్ 6,500 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. మొత్తం 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. హువావే పురా ఎక్స్ వ్యూలో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. హార్మొనీఓఎస్ 7.0పై రన్ అవుతుంది. ఈ ఫోన్ పూర్తి ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆగస్టు 28 నుంచి సేల్ :
హువావే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యు చెంగ్‌డాంగ్ ప్రకారం.. హువావే పురా ఎక్స్ వ్యూ ఆగస్టు 28 నుంచి అమ్మకానికి వస్తుంది. చైనాలో ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్, 12GB+ 512GB, 12GB + 1TB స్టోరేజ్ ఆప్షన్లలో కూడా లభించనుంది. హువావే పురా ఎక్స్ వ్యూ వైట్, రెడ్, యాష్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Read Also : OnePlus 15R Offer : ఈ వన్‌ప్లస్ ఫోన్ మీ బడ్జెట్ ధరలో.. ఇలా కొంటే రూ. 3వేలు తక్కువకే..!
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.39-అంగుళాల డిస్ప్లే (1,320 x 2,232 పిక్సెల్స్), 2,160Hz పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ 6,500 నిట్స్ టాప్ బ్రైట్నెస్ లెవల్ ఉన్నాయి. ఈ డిస్ప్లేకు 4 వైపులా 1.05మి.మీ. బెజెల్స్ ఉన్నాయి. వీడియోలు, స్టడీ, గేమ్స్ ఆడేందుకు ఈ స్మార్ట్‌ఫోన్ వైడ్ డిస్ప్లే అద్భుతమైన వ్యూ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని హువావే పేర్కొంది.
హువావే పురా ఎక్స్ వ్యూ 50MP ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్లో పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉంది. హార్మొనీఓఎస్ 7.0పై రన్ అవుతుంది. హువావే పురా ఎక్స్ వ్యూ 7,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.68 మి.మీ. మందంతో సుమారు 201 గ్రాముల బరువు ఉంటుంది.
హువావే నోవా 16 సిరీస్ ఫోన్లు ఇవే :
హువావే నోవా 16 సిరీస్ ఇటీవలే రివీల్ కాగా ఈ సిరీస్‌లో హువావే నోవా 16 SE కూడా ఉండనుంది. ఈ సిరీస్‌లో హువావే నోవా 16, నోవా 16z, నోవా 16 ప్రో, నోవా 16 అల్ట్రా ఉన్నాయి. హువావే నోవా 16 SEలో 1.5K రిజల్యూషన్‌తో ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ ఫ్లాట్ డిస్ప్లే ఉండొచ్చు.
కిరిన్ 8020 చిప్సెట్తో ఈ ఫోన్ రన్ అవుతుంది. హువావే నోవా 16 SE రియర్ కెమెరా యూనిట్లో రెడ్ మేపుల్ ఇమేజింగ్ టెక్నాలజీతో 50MP ప్రైమరీ కెమెరా ఉండొచ్చు. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8,500mAh బ్యాటరీ ఉంటుంది.
