iPhone 17 Pro : వావ్.. అద్భుతం.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. అమెజాన్‌లో రూ.10,000 తక్కువకే..!
iPhone 17 Pro : ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఐఫోన్ 17 ప్రోపై రూ. 10వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?
iPhone 17 Pro Discount
- ఐఫోన్ 17 ప్రోలో ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్
- 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా సెటప్
- 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే
iPhone 17 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 సందర్భంగా అనేక స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, టాబ్లెట్లు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై భారీ మొత్తంలో ఆఫర్లు లభిస్తున్నాయి.
ఫ్లాగ్షిప్ ఐఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ఐఫోన్ 17 ప్రోపై అదిరిపోయే ఆఫర్లను పొందవచ్చు. సేల్ సమయంలో ఈ ఐఫోన్ ధర తగ్గింపులు బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 17 ప్రోకు సంబంధించి పూర్తి వివరాలివే..
ఐఫోన్ 17 ప్రో ధర ఆఫర్లు :
ఐఫోన్ 17 ప్రో 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.1,28,490 ధరకు లిస్టు అయింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. దాంతో ఐఫోన్ ధర రూ.1,24,240కు తగ్గుతుంది. ఈ ఐఫోన్ గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.1,34,900 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు సుమారుగా రూ.10,660 చౌకగా లభిస్తుంది.
ఐఫోన్ 17 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 17 ప్రోలో ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్‌ను అందించారు. ఐఫోన్ 17 ప్రో బ్యాక్ సైడ్ ఎఫ్/1.78 అపర్చర్‌తో 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/2.8 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ ఐఫోన్లో సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఎఫ్/1.9 అపర్చర్‌తో 18MP ఫ్రంట్ కెమెరా ఉంది.
2622×1206 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఐఓఎస్ 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఐఫోన్లో 5G, Wi-Fi 7, e-SIM సపోర్ట్, బ్లూటూత్ 6 USB 3.0 టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
