Waterproof Smartphones : నీళ్లలో తడిసినా నో వర్రీ.. iQOO వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు మీకోసం.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

Waterproof Smartphones : వాటర్ లో తడిసినా చెక్కుచెదరని ఫోన్ల కోసం చూస్తున్నారా? ఐక్యూ 3 వాటర్ ప్రూఫ్ ఫోన్లు భారత మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఓసారి లుక్కేయండి.

Waterproof Smartphones : నీళ్లలో తడిసినా నో వర్రీ.. iQOO వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు మీకోసం.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

Waterproof Smartphones

Updated On : June 13, 2025 / 8:01 PM IST

Waterproof Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అసలే వర్షాకాలం.. బయటకు వెళ్తే ఎక్కడ ఫోన్ తడస్తుందనే భయం అక్కర్లేదు.. ఇలాంటి వాటర్ ప్రూఫ్ ఫోన్ కొనేస్తే సరి.. నీళ్లలో (Waterproof Smartphones) తడిసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కూలింగ్, పవర్‌ఫుల్ ఫోన్ కోరుకునేవారికి వాటర్‌‍ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు చాలా బెస్ట్..

వివో సబ్-బ్రాండ్ ఐక్యూ ఫోన్లలో అద్భుతమైన మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం ద్వారా ఈజీగా కొనేసుకోవచ్చు. ఈ 3 ఐక్యూ వాటర్ ప్రూఫ్ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనవచ్చు. ఏయే ఫోన్ ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..

ఐక్యూ నియో 10 :
ఐక్యూ నియో 10 ఫోన్ IP65 రెసిస్టెన్స్‌తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ కలిగి ఉంది. కెమెరా 50MP కలిగి ఉంది. 7000mAh బ్యాటరీ కూడా ఉంది. ఐక్యూ ఫోన్ అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. ఈ ఫోన్ రూ. 32వేలకు సొంతం చేసుకోవచ్చు.

Read Also : iPhone 16 Pro Price : ఖతర్నాక్ ఆఫర్ భయ్యా.. ఐఫోన్ 16 ప్రోపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఇంత తక్కువకు మళ్లీ జన్మలో రాదంతే..!

ఐక్యూ నియో 10R :
ఈ ఐక్యూ బ్రాండ్ ఫోన్ IP65 రెసిస్టెన్స్‌తో (Waterproof Smartphones) వస్తుంది. ఈ ఫోన్‌ను డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఐక్యూ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే.. 6400mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. 80W ఫ్లాష్ ఛార్జ్‌తో వస్తుంది. రూ. 25 వేల లోపు ధరలో కొనుగోలు చేయవచ్చు.

ఐక్యూ Z9s 5G ఫోన్ :
ఈ ఐక్యూ ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో ఫన్‌టచ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌తో వస్తుంది. పవర్ విషయానికొస్తే.. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. IP64 రేటింగ్ కలిగి ఉంది. రూ. 20వేల లోపు ధరకు సొంతం చేసుకోవచ్చు.