iQOO Z11 Sale : ఐక్యూ Z11పై భారీ ఆఫర్.. ఫస్ట్ సేల్‌లో రూ.4వేల వరకు డిస్కౌంట్.. రూ.31,499కే సొంతం!
iQOO Z11 Sale : భారత మార్కెట్లో iQOO Z11 ఫోన్ సేల్ ప్రారంభమైంది. ఈ ఫోన్లో 7050mAh బ్యాటరీ, 144Hz 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే, 50MP OIS కెమెరా, డైమెన్సిటీ 7500 టర్బో చిప్సెట్ ఉన్నాయి.
iQOO Z11 Sale
- భారత్‌లో ఐక్యూ జెడ్11 రూ. 34,999 ప్రారంభ ధరతో లభిస్తోంది
- ఈ ఫోన్లో 7050mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- 144Hz కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే, 50MP OIS కెమెరా సెటప్
iQOO Z11 Sale : కొత్త ఐక్యూ Z11 ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఐక్యూ అభిమానులు డిస్కౌంట్ ధరలో కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఐక్యూ కొత్త ఫోన్ ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రధానంగా ఈ ఐక్యూ ఫీచర్లలో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 3D కర్వ్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ 7500 టర్బో 5G చిప్సెట్, భారీ బ్యాటరీ, 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ IP69 రేటింగ్ అందిస్తుంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర, ఆఫర్లకు సంబంధించి పూర్తి వివరాలివే..
ఐక్యూ జెడ్11 ధర, స్పెసిఫికేషన్లు :
భారత మార్కెట్లో ఐక్యూ జెడ్11 ఫోన్ 6GB+128GB వేరియంట్ ధర రూ. 34,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB+128GB వేరియంట్‌ను రూ. 39,999కు కొనేసుకోవచ్చు. 8GB+256GB వేరియంట్‌ను రూ. 44,999కు కొనేసుకోవచ్చు.
టాప్-ఆఫ్-ది-లైన్ 12GB+256GB వేరియంట్ ధర రూ. 49,999 లభిస్తుంది. ఈ ఫోన్ అరోరా గ్రీన్, సెలెస్టియల్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అమెజాన్ , వివో ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లు, పార్టనర్ రిటైల్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్ ద్వారా కొనేసుకోవచ్చు.
బ్యాంకు ఆఫర్లు ఇవే :
ప్రారంభ ఆఫర్లలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 3వేలు ఫ్లాట్ డిస్కౌంట్, రూ. 1,000 కూపన్ డిస్కౌంట్, 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. ఐక్యూ Z11లో 6.83-అంగుళాల కర్వ్డ్ 3D అమోల్డ్ డిస్ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్, 449ppi పిక్సెల్ డెన్సిటీకి సపోర్ట్ చేస్తుంది.
Read Also : Honor Play 20A : బడ్జెట్లో భారీ బ్యాటరీ.. ఫోన్ వెనుకే మరో స్క్రీన్.. హానర్ ప్లే 20A వచ్చేసిందోచ్!
స్క్రీన్-టు-బాడీ రేషియో 93.82శాతం, కాంట్రాస్ట్ రేషియో 8000000:1. నెట్‌ఫ్లిక్స్ HDR ప్లేబ్యాక్ సపోర్ట్ అందిస్తుంది. ఈ ఫోన్లో 2000 నిట్స్ HBM బ్రైట్నెస్ ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.
ఈ ఫోన్ 4nm ప్రాసెసింగ్‌పై మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో SoC ద్వారా రన్ అవుతుంది. ఇందులో 3800mm2 వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంది. ఈ ఫోన్ వేడెక్కకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఫోన్ అనేక ఏఐ ఫీచర్లకు కూడా సపోర్టు ఇస్తుంది.
కెమెరా ఫీచర్లు :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్6తో వస్తుంది. కంపెనీ 12GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ అందించింది. ఈ బ్రాండ్ 3 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్లు, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తుంది.
ఐక్యూ జెడ్11 కెమెరా సెటప్‌లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP సోనీ IMX882 సెన్సార్ అందిస్తుంది. సెకండరీ కెమెరా 8MP అల్ట్రావైడ్-యాంగిల్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ ఫోన్లో 7,050mAh బిగ్ బ్లూవోల్ట్ బ్యాటరీ ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 10 నిమిషాల బూస్ట్ ఛార్జ్ ఫీచర్ ఉంది. ఈ ఫోన్‌ను 10 నిమిషాల్లో ఒక శాతం నుంచి 17శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. 44శాతం ఛార్జ్ అయ్యేందుకు కేవలం 30 నిమిషాలు పడుతుంది. ఈ ఫోన్ IP68/IP69 రేటింగ్‌తో వస్తుంది.
