Jio Recharge Plan : పండగ చేస్కోండి.. జియో చీపెస్ట్ 70 రోజుల ప్లాన్ ఇదే.. అన్లిమిటెడ్ కాలింగ్, OTT బెనిఫిట్స్ ఎంజాయ్..!
Jio Recharge Plan : జియో లక్షలాది కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందించే సరసమైన ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. 70 రోజుల ప్లాన్‌ను కూడా అందిస్తోంది. పూర్తి ప్లాన్ల వివరాలివే..
Jio 70 Days Recharge Plan
- జియో కస్టమర్ల కోసం అత్యంత చౌకైన ప్లాన్
- 70 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్ రూ. 666కే
- 105GB హై-స్పీడ్ డేటా వరకు పొందొచ్చు
Jio Recharge Plan : జియో కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్.. జియో ఇటీవలే 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 10వ వార్షికోత్సవం సందర్భంగా జియో తమ లక్షలాది కస్టమర్ల కోసం అనేక అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తోంది.
ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు 1.5GB రోజువారీ డేటా ప్లాన్లను నిలిపివేయగా జియో మాత్రం 1.5GB రోజువారీ డేటాతో అనేక ప్లాన్లను ఇంకా ఆఫర్ చేస్తూనే ఉంది. అంతేకాదు.. 70 రోజుల వ్యాలిడిటీతో పాటు అనేక బెనిఫిట్స్ తక్కువ ధరకే పొందవచ్చు.
జియో 70 రోజుల ప్లాన్ :
70 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ జియో రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 666కే లభిస్తోంది. ఈ ప్లాన్ బెనిఫిట్స్ దేశమంతటా ఫ్రీగా నేషనల్ రోమింగ్, అన్ లిమిటెడ్ (Jio Recharge Plan) వాయిస్ కాలింగ్ పొందవచ్చు. అంతేకాదు.. ఈ ప్లాన్ ప్రతిరోజూ 100 ఉచిత SMS, 1.5GB హై-స్పీడ్ డేటాను కూడా అందిస్తుంది.
మొత్తం 105GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. అయితే, ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ ఫ్రీ అన్ లిమిటెడ్ 5జీ డేటాను అందించదు. కానీ, జియో ఏఐ క్లౌడ్, జియో టీవీ ఓటీటీ యాప్ వంటి బెనిఫిట్స్ పొందవచ్చు.
జియో మెగా ఆఫర్ :
జియో ఇటీవల 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మెగా ఆఫర్‌ను ప్రకటించింది. కస్టమర్లకు రూ. 3599 రీఛార్జ్ ప్లాన్‌పై అదనపు డేటాను అందిస్తోంది. ఈ వార్షిక జియో రీఛార్జ్ ప్లాన్‌తో పాటు ప్రతిరోజూ 2.5GB హై-స్పీడ్ డేటా పొందొచ్చు. ఈ అదనపు డేటాతో వినియోగదారులు ఫుల్ ఇంటర్నెట్ను ఎంజాయ్ చేయొచ్చు.
రిలయన్స్ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్ కస్టమర్లకు దేశమంతటా అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్ వంటి బెనిఫిట్స్ అందిస్తుంది. అదనంగా, గూగుల్ జెమిని ఏఐ ప్రో, జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఇతర బెనిఫిట్స్ విషయానికి వస్తే.. జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, హాలీవుడ్ సినిమాలకు యాక్సెస్, 50GB క్లౌడ్ స్టోరేజ్ ఉన్నాయి.
