Jio Freedom Pack : జియో ఫ్రీడమ్ ప్యాక్ ఆఫర్.. రూ.10 వేలకే 15 నెలల బ్రాడ్‌బ్యాండ్, 100Mbps స్పీడ్‌తో పాటు OTT బెనిఫిట్స్!
Jio Freedom Pack : రిలయన్స్ జియో రూ.10,000 బ్రాడ్‌బ్యాండ్ ఫ్రీడమ్ ప్యాక్ 15 నెలల వ్యాలిడిటీ, 100Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తుంది. ఈ ప్యాక్ జియోఫైబర్ కస్టమర్లకు 3.3TB డేటాను జియోఎయిర్‌ఫైబర్ కస్టమర్లకు 1TB డేటాను అందిస్తుంది.
Jio Freedom Pack Explained
- జియో రూ.10,000 ప్లాన్ 15 నెలల వ్యాలిడిటీతో వస్తుంది
- ఈ ప్లాన్‌లో 100Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్, OTT యాప్‌లు
- జియోఫైబర్‌లో 3.3TB డేటా, జియోఎయిర్ఫైబర్లో 1TB డేటా
Jio Freedom Pack : రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం రూ.10,000 విలువైన ఫ్రీడమ్ ప్యాక్‌ను అందిస్తోంది. ఈ ప్యాక్ 15 నెలల సర్వీస్ వ్యాలిడిటీతో పాటు 100Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తుంది. కస్టమర్లు OTT యాప్‌లు, లైవ్ టీవీ ఛానెల్‌ల సబ్స్క్రిప్షన్లను పొందొచ్చు.
ఈ ఆఫర్ జియోఫైబర్, జియోఎయిర్‌ఫైబర్ కస్టమర్లకు వర్తిస్తుంది. అయితే, రెండు కనెక్షన్లలో డేటా లిమిట్ భిన్నంగా ఉంటుంది. జియోఫైబర్ కస్టమర్లకు 3.3TB డేటా లభిస్తుండగా, జియోఎయిర్‌ఫైబర్ కస్టమర్లకు 1TB డేటా లభిస్తుంది.
జియో రూ.10,000 ఫ్రీడమ్ ప్యాక్ వివరాలివే :
జియో రూ.10వేల ఫ్రీడమ్ ప్యాక్ 15 నెలల సర్వీసును అందిస్తుంది. డౌన్లోడ్లు, అప్లోడ్లు రెండింటికీ 100Mbps వరకు స్పీడ్ అందిస్తుంది. ఈ ప్యాక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై లాంగ్ టైమ్ వ్యాలిడిటీని కోరుకునే ప్రస్తుత జియోహోమ్ కస్టమర్లకు వర్తిస్తుంది.
కంపెనీ అధికారిక నిబంధనల ప్రకారం.. ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కస్టమర్ల లభ్యత అర్హత సమాచారాన్ని మైజియో యాప్‌లో లేదా జియో వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
జియోఫైబర్, ఎయిర్‌ఫైబర్‌లో ఎంత డేటా? :
ఈ ప్యాక్‌తో లభించే డేటా లిమిట్ మీ కనెక్షన్‌ను బట్టి మారుతుంది. జియోఫైబర్ కస్టమర్లకు 3.3TB డేటా లభించగా, జియోఎయిర్‌ఫైబర్ కస్టమర్లకు 1TB డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ 100Mbps వరకు స్పీడ్ అందిస్తుంది. అందుకే రీఛార్జ్ చేసే ముందు మీ కనెక్షన్‌ను బట్టి డేటా లిమిట్, ప్లాన్ నిబంధనలను చెక్ చేసుకోండి. అదనంగా, ఈ ప్యాక్‌లో లైవ్ టీవీ ఛానెళ్లకు యాక్సెస్ పొందవచ్చు.
అనేక ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ :
జియో ప్రకారం.. ఈ ఫ్రీడమ్ ప్యాక్‌లో అనేక OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. ఇందులో అమెజాన్ ప్రైమ్ లైట్, జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5, హోయిచోయ్, సన్నెక్స్ట్, డిస్కవరీ+, టైమ్స్ప్లే, తరంగ్ప్లస్, ఈరోస్ నౌ, లయన్స్‌గేట్ ప్లే, షెమరూమీ, ఈటీవీ విన్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తుంది. జీ5 బండిల్డ్ సబ్‌స్క్రిప్షన్‌లో స్పోర్ట్స్ కంటెంట్‌కు యాక్సెస్ ఉండదు.
జియో ఫ్రీడమ్ ప్యాక్ రూ.8,888కే :
జియోలో రూ.8,888 ధరతో ఫ్రీడమ్ ప్యాక్ ఉంది. 30Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్, OTT బెనిఫిట్స్ అందిస్తుంది. వ్యాలిడిటీ 12 నెలలు, అదనంగా మరో 4 నెలలు, మొత్తం 16 నెలలు పొందొచ్చు. అయితే, ఈ రెండు ప్యాక్‌ల ధరలు, నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి.
ఇప్పటికే ఉన్న జియోహోమ్ కస్టమర్ల కోసం రూ.10,000 ప్యాక్‌కు 15 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. కొత్త జియోహోమ్ కస్టమర్ల కోసం కంపెనీ వెబ్సైట్లో రూ.12,122కు ఆఫర్ అందిస్తుంది. దీనిలో 18 నెలల వ్యాలిడిటీ ఉంటుంది.
