Jio Unlimited 5G : జియో యూజర్లకు పండగే.. జస్ట్ రూ. 51తో అన్‌లిమిటెడ్ 5G డేటా.. నెలంతా ఎంజాయ్ చేయొచ్చు..!

Jio Unlimited 5G : జియో యూజర్ల కోసం అతి తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. రూ. 51తో అన్ లిమిటెడ్ 5G అందిస్తోంది.

Jio Unlimited 5G : జియో యూజర్లకు పండగే.. జస్ట్ రూ. 51తో అన్‌లిమిటెడ్ 5G డేటా.. నెలంతా ఎంజాయ్ చేయొచ్చు..!

Reliance Jio

Updated On : August 6, 2025 / 12:55 PM IST

Jio Unlimited 5G : జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. అతి చౌకైన ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్.. కేవలం రూ. 51 చెల్లిస్తే చాలు అన్‌లిమిటెడ్ 5G డేటా పొందవచ్చు. జియో 5G నెట్‌వర్క్ (Jio Unlimited 5G) కవరేజీ ప్రాంతంలో 5G స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. మీరు జియో కస్టమర్ అయితే.. ఈ బెస్ట్ ప్లాన్ అసలు వదులుకోవద్దు.

జియో రూ.51 ప్లాన్ బెనిఫిట్స్ :
జియో అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. రిలయన్స్ జియో రూ.51 ప్లాన్ ప్రత్యేకించి డేటా కోసం అందిస్తోంది. ఈ ప్లాన్ 3GB హైస్పీడ్ 4GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తుంది. ప్రత్యేకంగా 1.5GB రోజువారీ డేటాతో వస్తుంది. నెల వరకు వ్యాలిడిటీ పొందవచ్చు. ఈ డేటా ప్లాన్‌ యాక్టివ్ ప్లాన్‌లతో కలిపి అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. జియో రూ.101, రూ.151 ప్లాన్‌ల సబ్‌స్క్రైబర్‌లు అన్‌లిమిటెడ్ 5G డేటా పొందవచ్చు.

జియో రూ.101 ప్లాన్ 6GB హైస్పీడ్ డేటాతో అన్‌లిమిటెడ్ 5G బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని రోజువారీ 1GB డేటా ప్లాన్‌లకు వర్తిస్తుంది. రోజువారీ 1.5GB డేటా ప్లాన్‌తో 2 నెలల వ్యాలిడిటీతో వస్తుంది. 4G హై స్పీడ్ డేటా లిమిట్ తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64Kbpsకి పడిపోతుంది.

Read Also : Apple iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, కలర్ ఆప్షన్లు, ధర ఎంత ఉండొచ్చంటే?

జియో రూ.151 ప్లాన్ 9GB హైస్పీడ్ డేటాతో అన్‌లిమిటెడ్ 5G బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ 2 నెలల వ్యాలిడిటీతో రోజువారీ 1.5GB డేటా వస్తుంది. 4G హైస్పీడ్ డేటా లిమిట్ తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64Kbpsకి పడిపోతుంది. గత నెలలో జియో రూ.198 చౌకైన 5G ప్రీపెయిడ్ ప్లాన్‌ తీసుకొచ్చింది. జియో రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అందిస్తుంది.

ఈ రీఛార్జ్ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. 14 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అన్‌లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ బెనిఫిట్స్‌లో జియోటీవీ, జియోఏఐక్లౌడ్‌లకు యాక్సెస్ పొందవచ్చు. హైస్పీడ్ డేటా లిమిట్ తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64Kbpsకి పడిపోతుంది.