Jio vs Airtel : జియో రూ.999 ప్లాన్ vs ఎయిర్టెల్ రూ.899 ప్లాన్: ఏది బెస్ట్? ఎందులో బెనిఫిట్స్ ఎక్కువ? ఫుల్ డిటెయిల్స్
Jio vs Airtel : ఎయిర్ టెల్ లేదా జియో మీది ఏ నెట్ వర్క్.. ఈ రెండింటిలో ప్రీపెయిడ్ ప్లాన్ ఏది బెటర్? వ్యాలిడిటీ, డేటా బెనిఫిట్స్ అన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం..
Jio vs Airtel
- జియో రూ. 999 ప్లాన్ 98 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా
- జియోహాట్‌స్టార్, జియోఏఐక్లౌడ్ గూగుల్ జెమిని ప్రో బెనిఫిట్స్
- ఎయిర్టెల్ రూ. 899 ప్లాన్, 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5GB డేటా
- అన్లిమిటెడ్ కాల్స్, 100 SMS, హలో ట్యూన్స్
Jio vs Airtel : లాంగ్ టైమ్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? మీది జియోనా? లేదా ఎయిర్టెల్ వాడుతున్నారా? యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రస్తుతం టెలికాం ఆపరేటర్లు డేటా, కాలింగ్ మినిట్స్, ఎంటర్టైన్మెంట్ ప్యాక్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ ఆధారిత సర్వీసులతో ప్యాకేజీలను అందిస్తున్నారు.
మీరు జియో రూ. 999 ప్యాక్ లేదా ఎయిర్టెల్ రూ. 899 ప్లాన్ ఏది ఎంచుకోవాలో తేల్చుకోలేకపోతున్నారా? డోంట్ వర్రీ.. జియో, ఎయిర్టెల్ (Jio vs Airtel) ప్లాన్ల వ్యాలిడిటీ, డేటా బెనిఫిట్స్, అదనపు బెనిఫిట్స్ ఎందులో ఎక్కువ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
జియో రూ. 999 ప్రీపెయిడ్ రీఛార్జ్ :
మీ దగ్గర జియో సిమ్ ఉందా? 98 రోజుల వ్యాలిడిటీతో రూ. 999 ప్లాన్ తీసుకోండి. ఈ ప్లాన్‌తో రోజుకు 2GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. అయితే, లిమిట్ దాటాక కూడా ఇంటర్నెట్ను యాక్సెస్ చేయొచ్చు. కానీ, డేటా స్పీడ్ 64 Kbpsకి పడిపోతుంది. జియో ట్రూ 5జీ సర్వీసు ఉంటే ఈ ప్లాన్ అర్హులైన యూజర్లకు అన్ లిమిటెడ్ 5జీ డేటా పొందవచ్చు.
Read Also : Oppo K15 Launch : ఒప్పో కొత్త ఫోన్ కేక.. 8,000mAh బ్యాటరీతో కిర్రాక్ అంతే.. ధర ఎంతో తెలుసా?
డేటా బెనిఫిట్స్, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS పొందవచ్చు. ఈ రీఛార్జ్‌లో 3 నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ 50జీబీ ఫ్రీ జియోఏఐక్లౌడ్ స్టోరేజ్ ఉంటాయి. జియో 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. దీని అసలు వాల్యూ రూ. 35,100గా కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. 5TB క్లౌడ్ స్టోరేజ్, ఇతర ఏఐ ఫీచర్లు కూడా పొందవచ్చు.
ఎయిర్టెల్ రూ. 899 ప్రీపెయిడ్ రీఛార్జ్ :
ఈ ఎయిర్టెల్ ప్లాన్ కేవలం 84 రోజులకు మాత్రమే వ్యాలిడిటీ అందిస్తుంది. డేటా బెనిఫిట్స్ విషయానికొస్తే.. రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. ఆ తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్‌తో అన్ లిమిటెడ్ లోకల్, STD రోమింగ్ కాల్స్ పొందవచ్చు. రోజువారీగా 100 SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. అయితే, లిమిట్ దాటిన తర్వాత ప్రతి SMSకు రూ. 1.5 STD ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రీఛార్జ్‌లో ఫ్రీ హలో ట్యూన్స్ కూడా ఉన్నాయి. ప్రతి 30 రోజులకు ట్యూన్‌ను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా సెట్ చేసుకోవచ్చు. రోజువారీ డేటా లిమిట్ తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి పడిపోతుంది. అర్హత గల సబ్స్క్రైబర్లు, ఎయిర్టెల్ నిబంధనలకు లోబడి, సపోర్ట్ ప్రాంతాలలో అన్ లిమిటెడ్ 5జీ డేటాను కూడా పొందవచ్చు.
ఇందులో ఏ ప్లాన్ బెస్ట్? :
మనీ సేవ్ చేయాలంటే ఎయిర్టెల్ రూ. 899 ప్లాన్ ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌తో అన్ లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. రోజుకు 1.5జీబీ డేటా 100 SMS కూడా వస్తాయి. జియోతో పోలిస్తే బెస్ట్ ప్లాన్ కాదు.. ఎందుకంటే జియో రూ. 999 ప్లాన్ ప్రైమరీ కాలింగ్ డేటా బెనిఫిట్స్, ఏఐ ఫీచర్లు కూడా అందిస్తుంది.
