Jio vs Airtel : జియో vs ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు.. చీప్‌ది ఏది? ఫాస్ట్ది ఏది? ఏ వైఫై ప్లాన్ బెస్ట్? ఫుల్ డిటెయిల్స్
Jio vs Airtel : ఎయిర్టెల్, జియో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు అత్యంత సరసమైన ధరకే లభిస్తున్నాయి. జియో ఫైబర్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ రెండింటిలో ఏది ఫాస్ట్ ఇంటర్నెట్ అందిస్తున్నాయంటే?
Jio vs Airtel Broadband Plans
Jio vs Airtel : మీరు మంచి బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా మీ స్మార్ట్ టీవీలో 4K స్ట్రీమింగ్ కోసమైనా సరసమైన ధరలో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ రెండూ అన్ లిమిటెడ్ డేటా, హై-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తున్నాయి.
ఇందులో జియో ఫైబర్ కేవలం రూ. 399 నుంచి అత్యంత సరసమైన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ అందిస్తోంది. అదే ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ రూ.499 ప్లాన్‌లో OTT యాప్‌లు, క్లౌడ్ స్టోరేజ్ కూడా అందిస్తుంది. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో ఇష్టమైన సిరీస్‌లు లేదా మూవీలను యాక్సస్ చేయొచ్చు.
జియో ఫైబర్ ప్లాన్లు :
అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కోరుకునేవారికి జియో ఫైబర్ బెస్ట్ ఆప్షన్. రూ. 399 నుంచి బేసిక్ ప్లాన్, ఇమెయిల్, బ్రౌజింగ్, ఆఫీస్ వర్క్ కోసం 30Mbps స్పీడ్ వేగం అవసరమయ్యే విద్యార్థులకు అద్భుతమైన ప్లాన్. జియో రూ.699 ప్లాన్ 100Mbps సూపర్ ఫాస్ట్ స్పీడ్ అందిస్తుంది. జూమ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. భారీ ఫైళ్లను ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఎలాంటి అంతరాయం లేకుండా హై-డెఫినిషన్ వీడియోను స్ట్రీమ్ చేయవచ్చు.
రూ. 999 ఎంటర్టైన్మెంట్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్. 150Mbps స్పీడ్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్ వంటి ప్రీమియం OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఫ్రీ యాక్సెస్ అందిస్తుంది. అంతేకాదు.. వైర్డ్ ఫైబర్ అందుబాటులో లేని ప్రాంతాల్లో జియో ఎయిర్‌ఫైబర్ కేవలం రూ. 599 నుంచి ఓవర్-ది-ఎయిర్ ఇంటర్నెట్, 550కి పైగా టీవీ ఛానెళ్లను అందిస్తుంది.
ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్రీమియం ప్లాన్లు :
ఎయిర్టెల్ వినియోగదారులకు కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాదు.. వర్క్, ఎంటర్టైన్మెంట్, ప్రీమియం డిజిటల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఎయిర్టెల్ రూ. 499 ఎంట్రీ-లెవల్ ప్లాన్‌తో వస్తుంది. జియో ప్లాన్ కన్నా కొంచెం కాస్ట్ ఉంటుంది. కానీ, 40Mbps స్పీడ్ అందిస్తుంది. గూగుల్ వన్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ టూల్స్ కూడా యాక్సెస్ పొందవచ్చు.
రూ. 699 ఫ్యామిలీ ప్లాన్ 100Mbps వరకు స్పీడ్, 350కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు, హాట్‌స్టార్ యాప్‌లకు సపోర్టు ఇస్తుంది. ప్రీమియం ప్లాన్ కోసం రూ. 999 ధరతో అల్టిమేట్ ప్లాన్ 200Mbps స్పీడ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి మెయిన్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ అందిస్తుంది.
