Lava Shark 2 5G : 6000mAh బ్యాటరీ, 13MP కెమెరాతో లావా షార్క్ 2 5జీ వచ్చేసింది.. ధర చాలా చీప్ గురూ!
Lava Shark 2 5G : లావా షార్క్ 2 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. 6000mAh బ్యాటరీతో 6.75-అంగుళాల HD+ LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ లావా ఫోన్ ధర జస్ట్ ఎంతంటే?
Lava Shark 2 5G
- లావా షార్క్ 2 5జీ ఫోన్ 6.75-అంగుళాల HD+ ఎల్సీడీ డిస్ప్లే
- 13MP మెయిన్ కెమెరా, 6000mAh బ్యాటరీతో వస్తుంది
- 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల HD+ LCD డిస్ప్లే
Lava Shark 2 5G : లావా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త స్మార్ట్‌ఫోన్ లావా షార్క్ 2 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. లావా షార్క్ 2 5జీలో 13MP ప్రైమరీ రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ అందిస్తుంది. లావా షార్క్ 2 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం..
లావా షార్క్ 2 5జీ ధర ఎంతంటే? :
లావా షార్క్ 2 5జీ ఫోన్ ధర రూ. 11,999కు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 10, 2026 నుంచి అన్ని లావా రిటైల్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ లావా ఫోన్‌తో పాటు ఫ్రీ డోర్‌స్టెప్ సర్వీస్ కూడా లభిస్తుంది.
లావా షార్క్ 2 5జీ స్పెసిఫికేషన్లు :
లావా షార్క్ 2 5జీ ఫోన్ 1612×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల HD+ LCD డిస్ప్లేతో వస్తుంది. మాలి-G57 MC2 జీపీయూతో యూనిసోక్ T8200 6nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
Read Also : Jio OTT Pass : ఓటీటీ లవర్స్‌కు పండగే.. జియో పాస్‌తో జాక్‌పాట్.. రూ. 200కే 15 యాప్స్, 1000 ఛానెల్స్!
ఇందులో 4GB LPDDR4x ర్యామ్, 64GB యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ అందిస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. లావా షార్క్ 2 5జీ బ్యాక్ సైడ్ 13MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 5MP కెమెరా ఉంది. కొలతల పరంగా, ఈ ఫోన్ 165.85 మిమీ పొడవు, 76.8 మిమీ వెడల్పు, 8.75 మిమీ మందం, 210 గ్రాముల బరువు ఉంటుంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ VoLTE, డ్యూయల్ సిమ్ సపోర్ట్, Wi-Fi, బ్లూటూత్ 5.0, జీపీఎస్, GLONASS, సింగిల్ యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీతో రన్ అవుతుంది.
