Lava Virat V1 Series : లావా కొత్త ఫోన్లు వచ్చేశాయ్.. విరాట్ V1 సిరీస్ అదుర్స్.. ధర చాలా చీప్ గురూ..!
Lava Virat V1 Series : లావా విరాట్ V1 5G విరాట్ V1 భారతదేశంలో విడుదలయ్యాయి. స్వదేశీ బ్రాండ్‌కు చెందిన ఈ రెండు ఫోన్లు శక్తివంతమైన బ్యాటరీలతో వస్తాయి. వీటి ధరలు ₹8,999 నుండి ప్రారంభమవుతాయి.
Lava Virat V1 Series
- లావా కొత్త Virat V1 సిరీస్ వచ్చేసింది
- రూ.10 వేలలోపు ధరలో లావా రెండు కొత్త ఫోన్లు
- తక్కువ ధర.. పెద్ద బ్యాటరీ.. లావా విరాట్ వి1 అదుర్స్
Lava Virat V1 Series : లావా ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఫోన్లు వచ్చేశాయి. లావా భారత మార్కెట్లో కొత్త విరాట్ V1 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ భారతీయ బ్రాండ్ ఈ సిరీస్‌లో ఒకేసారి రెండు ఫోన్లను మార్కెట్లోకి దించింది. ఇందులో ఒకటి 5G మోడల్ కాగా, మరొకటి 4G మోడల్ ఉంది. ఈ సిరీస్‌లో లావా విరాట్ V1 5జీ, లావా విరాట్ V1 పేరుతో రెండు ఫోన్లు లభిస్తున్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ రూ. 8,999 ప్రారంభ ధరతో వచ్చింది. అలాగే, 6000mAh వరకు (Lava Virat V1 Series) పవర్ఫుల్ బ్యాటరీ ఉంది. ఈ భారతీయ బ్రాండ్ త్వరలో భారత్ తరహాలో యూకే మార్కెట్లోకి కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. యూకేలో కంపెనీ ఫస్ట్ ఫోన్ అతి త్వరలోనే లాంచ్ కావొచ్చు.
ధర ఎంతంటే? :
లావా విరాట్ వి1 సిరీస్‌లోని రెండు ఫోన్లు 4జీబీ ర్యామ్, 64GB స్టోరేజ్‌తో వస్తాయి. లావా విరాట్ వి1 5జీ ఫోన్ రూ. 12,999 ధరకు లాంచ్ అయింది. ఈ ఫోన్‌పై రూ. 1,000 తగ్గింపు పొందవచ్చు. తద్వారా రూ. 11,999 లాంచ్ ఆఫర్‌తో కొనేసుకోవచ్చు. ఈ లావా విరాట్ వి1 5జీ ఫోన్ ఆర్య బ్లూ సోనార్ గోల్డ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
మరోవైపు, లావా విరాట్ వి1 4జీ ఫోన్ ధర రూ. 9,999గా ఉంది. రూ.1,000 తగ్గింపుతో రూ. 8,999కే అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్లు జూలై 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ కంపెనీ అధికారిక స్టోర్‌లో కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ నీలగిరి బ్లూ హిమాలయన్ సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో కూడా పొందవచ్చు.
లావా విరాట్ V1 5జీ : రూ. 11,999
లావా విరాట్ V1 : రూ. 8,999
లావా విరాట్ V1 సిరీస్ ఫీచర్లు :
భారతీయ బ్రాండ్‌కు చెందిన ఈ రెండు ఫోన్లు 6.75-అంగుళాల HD+ డిస్ప్లేతో వస్తాయి. 5జీ మోడల్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. కంపెనీ లావా విరాట్ వి1 5జీలో యునిసోక్ T8200 5జీ చిప్సెట్ అమర్చారు.
అలాగే, 4జీ మోడల్ యునిసోక్ SC9863A చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఈ రెండు ఫోన్లు 4జీబీ ర్యామ్, 64GB స్టోరేజ్‌తో వస్తాయి. ఈ రెండు ఫోన్ల ర్యామ్ వర్చువల్‌గా 4జీబీ వరకు విస్తరించుకోవచ్చు. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను కూడా పెంచుకోవచ్చు.
ఈ రెండు లావా ఫోన్లు IP64 డస్ట్ వాటర్ రెసిస్టెంట్‌తో లభిస్తున్నాయి. బ్యాక్ సైడ్ 13ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరాతో సహా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5ఎంపీ ఫ్రంట్ కెమెరా పొందవచ్చు. 5జీ మోడల్లో 6,000mAh బ్యాటరీ ఉండగా, 4జీ మోడల్లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతాయి.
| లావా విరాట్ V1 5G | లావా విరాట్ V1 | |
| డిస్ప్లే | 6.75 అంగుళాలు, 120Hz, HD+ | 6.75 అంగుళాలు, HD+ |
| ప్రాసెసర్ | యూనిసోక్ టి8200 | యూనిసోక్ SC9863A |
| స్టోరేజీ | 4GB, 64GB | 4GB, 64GB |
| బ్యాటరీ | 6000mAh | 5000mAh |
| కెమెరా | 13MP AI, 5MP | 13MP AI, 5MP |
| ఓఎస్ | ఆండ్రాయిడ్ 16 | ఆండ్రాయిడ్ 16 |
