Meta AI Agents : ఏఐ ప్రపంచంలో మెటా కొత్త సంచలనం.. ప్రతి ఒక్కరికీ సొంత AI ఏజెంట్.. మీ పనులన్నీ అవే చేస్తాయి..!
Meta AI Agents : మెటా యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మీకోసం ఒక ఏఐ ఏజెంట్ పనిచేయనుంది. మీ పర్సనల్ పనులన్నీ అవే చేసి పెడతాయి అనమాట.. ఎలాగంటే?
Meta AI Agents
- ఏఐ ప్రపంచంలో మెటా కొత్త ప్రయోగం
- ప్రతి ఒక్కరికి కోసం సొంత ఏఐ ఏజెంట్
- మీ వ్యక్తిగత పనులన్నీ ఈ ఏజెంట్లు చేస్తాయి
Meta AI Agents : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా ఇప్పుడు ఏఐ ఏజెంట్ల వైపు అడుగులు వేస్తోంది. రోజువారీ టాస్కులను పూర్తి చేయగల కొత్త, కస్టమైజడ్ ఏఐ ఏజెంట్లపై ఈ సంస్థ పనిచేస్తోంది. ఓపెన్‌క్లా మాదిరిగానే వినియోగదారులు ఏజెంట్లకు టాస్కులను అసైన్ చేయొచ్చు. అప్పుడు బ్యాక్ గ్రౌండ్లో వాటికి కేటాయించిన టాస్కులపై పనిచేస్తాయని రిపోర్టులు సూచిస్తున్నాయి.
ఏఐ ఏజెంట్లు ఫుల్ పాపులర్ అయ్యాయి. మనుషులు చేసే పనులన్నీ వాటికి అవే చేయగలవు. ఏఐ ఏజెంట్లను కోడ్ రాయడం లేదా టాస్కులు చేసేందుకు ఉపయోగిస్తారు. అయితే, మార్క్ జుకర్‌బర్గ్ రోజువారీ పనుల కోసం కూడా ఏఐ ఏజెంట్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.
నివేదిక ప్రకారం.. 3 బిలియన్లకు పైగా యూజర్ల రోజువారీ టాస్కుల కోసం కొత్త పర్సనలైజడ్ ఏఐ ఏజెంట్లపై మెటా వర్క్ చేస్తోంది. మెటా ప్రస్తుతం ఏఐలో బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెడుతోంది. ఇందులో భాగంగానే మెటా ఇటీవల ఓపెన్‌క్లా ఏఐ ఓన్లీ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మోల్ట్‌బుక్‌ను కొనుగోలు చేసింది.
Read Also : Realme 16T 5G : ఛార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై.. 8,000mAh బ్యాటరీతో కొత్త రియల్‌మి 5జీ ఫోన్ రాబోతోంది..!
మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌లో ఇప్పుడు మోల్ట్‌బుక్ టీమ్ చేరింది. రిపోర్టుల ప్రకారం.. మెటా కొత్త కస్టమైజడ్ ఏఐ ఏజెంట్లు, ఓపెన్‌క్లా ఏజెంట్ల మాదిరిగానే ఉంటాయి. అయితే, ఓపెన్క్లాకు భిన్నంగా మెటా ఏజెంట్లు సొంత మ్యూస్ స్పార్క్ ఏఐ మోడల్ ద్వారా పనిచేస్తాయి.
ఏఐ ఏజెంట్లు ఎలా పనిచేస్తాయి? :
కొత్త ఏజెంట్లను ఉద్యోగుల బృందంతో టెస్టింగ్ చేస్తున్నట్టు రిపోర్టులు సూచిస్తున్నాయి. ఓపెన్‌క్లా మాదిరిగానే యూజర్లు తమ ఏజెంట్లకు టాస్కులను కేటాయించవచ్చు. ఆ తర్వాత బ్యాక్ గ్రౌండ్లో వర్క్ ఆపరేట్ చేస్తుంటాయి.
అయితే, ఓపెన్‌క్లా మాదిరిగా ఏజెంట్లు డివైజ్‌లోనే వర్క్ అవుతాయా? లేదా ఆంత్రోపిక్ క్లౌడ్ మాదిరిగా అంతా క్లౌడ్ ద్వారా జరుగుతుందా అనేది క్లారిటీ లేదు. ఆసక్తిగల వినియోగదారులు హెల్త్, ఆర్థిక డేటాతో సహా సున్నితమైన డేటాను ఈ మోడల్స్‌తో షేర్ చేయాలని మెటా భావిస్తున్నట్టు రిపోర్టు సూచిస్తుంది. ఈ ఏజెంట్ల ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు ప్రస్తుతానికి రివీల్ చేయలేదు.
మెటా కేవలం ఏఐ ఏజెంట్లను మాత్రమే కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌కు స్పెషల్ ‘ఏజెంట్ షాపింగ్ టూల్’ను కూడా యాడ్ చేయాలని భావిస్తోంది. 2026 నాల్గో త్రైమాసికానికి ముందే ఈ టూల్ అందుబాటులోకి వస్తుందని అంచనా.
