Mivi One Smartphone : మివి నుంచి ఫస్ట్ 5G ఫోన్ వచ్చేసింది.. ధర జస్ట్ రూ. 15వేల లోపే.. ఫీచర్లు మాత్రం కేక..!
Mivi One Smartphone : మివి నుంచి మొదటి 5జీ ఫోన్ లాంచ్ అయింది. ధర కూడా రూ. 14,999కే లభిస్తోంది. ఈ ఫోన్ అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
Mivi One Smartphone
- మివి వన్ ఎట్టకేలకు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది
- క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్, 50MP డ్యూయల్ కెమెరా, 6,000mAh బ్యాటరీ
- అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది
Mivi One Smartphone : స్వదేశీ కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ మివి నుంచి సరికొత్త మివి వన్ వచ్చేసింది. రూ. 14,999 ధరలో మివి వన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్, 50MP డ్యూయల్ కెమెరా సెటప్, 6,000 mAh బ్యాటరీ మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
కంపెనీ ప్రకారం.. స్ట్రీమింగ్, ఫొటోగ్రఫీ, సోషల్ మీడియా, గేమింగ్, మల్టీటాస్కింగ్ రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని మివి వన్ ఫోన్ లాంచ్ అయింది. వేరియంట్ల వారీగా ధరల నుంచి స్పెసిఫికేషన్ల వరకు మివి వన్ ఫోన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మివి వన్ స్పెసిఫికేషన్లు :
మివి వన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల HD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌ను అమర్చారు. 8GB వరకు ర్యామ్ 128GB స్టోరేజ్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ ఫోన్లో 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 18 వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే..
మివి వన్ బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 9.15mm మందంతో 210గ్రాముల బరువుతో ఉంటుంది. మివి వన్ IP64 ప్రొటెక్షన్‌తో కూడా వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది.
Read Also : Diwali Car Rush : దీపావళి 2026కి కొత్త కార్ల జాతర.. EV, SUV, ఫేస్‌లిఫ్ట్ మోడళ్లతో భారీ లాంచ్‌లు!
భారత్‌లో మివి వన్ ధర, కలర్ ఆప్షన్లు :
మివి వన్ 4జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 14,999, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 15,999, 8GB + 128GB వేరియంట్ ధర రూ. 16,999గా ఉంది. బ్లూ, రోజ్, గ్రీన్, బర్గండీ నేవీ బ్లూ అనే 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
మివి వన్ కొనుగోలుతో జియో కస్టమర్లు అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. జియోలో ప్రతి యాక్టివ్ మొబైల్ నంబర్‌పై 12 నెలల పాటు రూ. 4వేలు విలువైన కాన్వా ప్రో సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఒక నెల పాటు ఫ్రీ జియోహాట్‌స్టార్ మొబైల్ + హాలీవుడ్ యాక్సెస్ కూడా పొందవచ్చు.
అదనంగా, జియో కస్టమర్లు 5,000GB గూగుల్ క్లౌడ్ స్టోరేజ్‌తో 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. 50GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 8న మివి వన్ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.
