Mother’s Day 2026 : మదర్స్ డే స్పెషల్: కిచెన్ నుంచి హెల్త్ వరకు.. ప్రతి అమ్మకు కావాల్సిన 5 స్మార్ట్ గిఫ్ట్‌లు ఇవే.. లైఫే మారిపోతుంది!
Mother’s Day 2026 : 2026 మదర్స్ డే మే 10 (ఆదివారం) వచ్చింది. ఈ రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? మీ అమ్మకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వవచ్చు. ఎప్పటిలా కాకుండా మీ అమ్మకు టెక్ గాడ్జెట్లు అంటే ఇష్టమైతే స్మార్ట్ గాడ్జెట్లను గిఫ్ట్ ఇవ్వొచ్చు.
Mother’s Day 2026 ( Image Credit : AI )
- మీ అమ్మకు మే 10న మదర్స్ డే స్పెషల్ విషెస్ చెప్పండి
- కిచెన్ నుంచి బెడ్ రూం వరకు స్మార్ట్ గాడ్జెట్లు ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి
- ఒంటరిగా ఉండే తల్లులకు స్మార్ట్ డోర్ బెల్ కూడా బహుమతిగా ఇవ్వొచ్చు
Mother’s Day 2026 : మదర్స్ డే.. మే 10వ తేదీన జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా తల్లుల కోసం ఈ రోజును ప్రత్యేక పద్ధతులలో హ్యాపీ మదర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరు తమ తల్లులకు ఫ్లవర్ బుకే ఇస్తే.. మరికొందరు ఆన్లైన్లో విషెస్ పంపుతారు. వాట్సాప్ స్టేటస్‌ల నుంచి ఫేస్బుక్ పోస్టుల వరకు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతుంది.
అయితే, మీరు కాస్త భిన్నంగా ఆలోచించవచ్చు. ఈ మదర్స్ డే (Mother’s Day 2026) రోజున మీ అమ్మకు ఒక స్మార్ట్ గాడ్జెట్‌ను గిఫ్ట్ ఇచ్చి చూడండి. ఈ గాడ్జెట్లను కిచెన్ నుంచి బెడ్ రూం వరకు ఉపయోగించవచ్చు. మీ అమ్మగారి రోజువారీ పనులకు చాలా ఉపయోగపడతాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వెజిటేబుల్స్, ఫ్రూట్స్ క్లీనర్ :
ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో అమ్మే పండ్లు, కూరగాయలు కల్తీ అయ్యే రిస్క్ ఎక్కువ. మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మార్కెట్లో పండ్లు, కూరగాయలు కొన్న తర్వాత వాటిని వంటగదిలో క్లీన్ చేసేందుకు చాలా సమయం పడుతుంది. ఇందుకోసం కూరగాయలు, పండ్లను క్లీన్ చేసే క్లీనర్లు తీసుకోవచ్చు. ఓజోన్ ఆధారిత క్లీనింగ్ కూరగాయలు, ఫ్రూట్స్ క్లీనర్లు బాగా పాపులర్ అయ్యాయి.
రూ. 5వేల బడ్జెట్లో బ్రాండెడ్ కంపెనీ నుంచి వెజిటేబుల్, ఫ్రూట్స్ క్లీనర్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు. పండ్లు, కూరగాయలను క్లీన్ చేయడం ఈజీ అవుతుంది. మీ అమ్మకు ఇలాంటి స్మార్ట్ గాడ్జెట్‌ను గిఫ్ట్ ఇస్తే ఆమెకు చాలా సమయాన్ని ఆదా చేస్తుంది.
స్మార్ట్ డోర్‌బెల్ :
మీ అమ్మగారు రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉంటారా? ఆమెకు ఒక స్మార్ట్ డోర్‌బెల్‌ను గిఫ్ట్ ఇవ్వవచ్చు. ఆఫీసుకు వెళ్లేవారికి వారి తల్లిదండ్రులు ఇంట్లో ఒంటరిగా ఉండే వారికి ఇది చాలా బాగుంటుంది. స్మార్ట్ డోర్‌బెల్ ద్వారా మీ అమ్మగారు తన స్మార్ట్‌ఫోన్‌లో డోర్ వద్దకు ఎవరు వచ్చారో చూడొచ్చు.
కేవలం ఫోన్లో మాట్లాడటం ద్వారానే ఆమె డోర్ తెరవాలో లేదో డిసైడ్ అవ్వొచ్చు. 2026 సంవత్సరంలో రాబోయే స్మార్ట్ డోర్‌బెల్స్ లోకల్ భాషలలో కూడా సపోర్టు చేస్తాయి. మీరు బ్రాండెడ్ కంపెనీల డోర్‌బెల్స్‌ను మీ ఇంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. స్మార్ట్ డోర్‌బెల్‌ను ఇన్స్టాల్ చేసేందుకు మీరు కనీసం రూ. 10వేలు బడ్జెట్ ఉండాలి.
ఆటోమేటిక్ రోటీ మేకర్, స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్ :
అమ్మ చేతి వంట రుచిని ఏ డివైజ్ కూడా రిప్లేస్ చేయలేదు. అయితే, మీ అమ్మ అనారోగ్యంతో ఉంటే ఆటోమేటిక్ రోటీ మేకర్ లేదా స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్ గిఫ్ట్ ఇవ్వొచ్చు. వేసవిలో గంటల తరబడి వంటగదిలో నిలబడి రొట్టెలు ఒత్తడం వంటివి చేస్తే అలసటగా అనిపిస్తుంది. మీ అమ్మకు ఆటోమేటిక్ రోటీ మేకర్‌ను గిఫ్ట్ ఇచ్చారంటే ఆమె కిచెన్ పని చాలా ఈజీ అవుతుంది.
స్మార్ట్ హెల్త్ మానిటర్ :
ఇంటి బాధ్యతలతో చాలామంది తల్లులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. మహిళలు తరచుగా అధిక రక్తపోటు, మధుమేహం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ రోజుల్లో మీ అమ్మకు మంచి గిఫ్ట్ అందించే స్మార్ట్ గాడ్జెట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్‌వాచ్ కూడా అద్భుతమైన ఆప్షన్. హార్ట్ రేట్, స్లీప్ మానిటరింగ్ వంటి టాస్కులను కూడా చేస్తుంది. అంతేకాదు.. మీరు ఆన్లైన్లో డిజిటల్ ఫొటో ఫ్రేమ్‌లను కూడా ఆర్డర్ చేయవచ్చు. మీ అమ్మగారి దగ్గర ఇంకా కీప్యాడ్ ఫోన్ ఉంటే.. ఆమెకు స్మార్ట్‌ఫోన్ కూడా గిఫ్ట్ ఇవ్వవచ్చు.
