Moto G37 Power Price : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో G37 పవర్ ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Moto G37 Power Price : మోటోరోలా జీ37 5G ఫోన్ ధర తగ్గింది. 50MP కెమెరాతో మోటో జీ37 పవర్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?
Moto G37 Power Price
- 6.7-అంగుళాల HD+ LCD డిస్ప్లే
- మీడియాటెక్ డైమెన్సిటీ 6400 6nm ప్రాసెసర్
- 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా
Moto G37 Power Price : మోటోరోలా ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మీ బడ్జెట్ రూ.20వేలు అయితే మోటో G37 పవర్ అద్భుతమైన ఆప్షన్.
ఈ సేల్ సమయంలో మోటోరోలా జీ37 ధర తగ్గింపు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు పొందవచ్చు. ఈ ఫోన్లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మోటో G37 పవర్‌పై ఆఫర్లు, డిస్కౌంట్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
మోటో జీ37 పవర్ ధర, ఆఫర్లు :
మోటో జీ37 పవర్ ఫోన్ 4GB+128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,999 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.1,750 తగ్గింపు పొందవచ్చు. దాంతో ఈ మోటో ఫోన్ ధర రూ.14,249 అవుతుంది. అలాగే, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ.14,100 వరకు సేవ్ చేయొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ టాప్ బెనిఫిట్, ఎక్స్చేంజ్ చేసే డివైజ్, ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
Read Also : Realme 16x 5G Sale : 7000mAh బ్యాటరీతో రియల్‌మి రచ్చ! కొత్త 16x 5G సేల్ స్టార్ట్.. ధర చూస్తే షాక్!
మోటో జీ37 పవర్ స్పెసిఫికేషన్లు :
మోటో జీ37 పవర్లో 1604×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.7-అంగుళాల HD+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఏఆర్ఎమ్ మాలి-జీ57 ఎంసీ2 జీపీయూతో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 6nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
ఇందులో 4GB/8GB LPDDR4X ర్యామ్, 64GB/128GB యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కంపెనీ ఒక ఏడాది OS అప్డేట్, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. :
మోటో జీ37 పవర్లో బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 2-ఇన్-1 లైట్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ అందిస్తుంది. MIL-STD 810H సర్టిఫికేషన్ కూడా ఉంది.
కొలతల పరంగా మోటో జీ37 పవర్ ఫోన్ 166.23 మిమీ పొడవు, 76.50 మిమీ వెడల్పు, 8.89 మిమీ మందం, 215 గ్రాముల బరువు ఉంటుంది. 7000mAh బ్యాటరీ ఉంది. 30W టర్బోఛార్జింగ్ 6W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 3.5mm ఆడియో జాక్, 5జీ, డ్యూయల్ 4జీ VoLTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.4, జీపీఎస్, సింగిల్ యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
