Motorola G96 5G : వాలెంటైన్స్ డే సేల్.. ఈ మోటోరోలా 5జీ ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Motorola G96 5G : మోటోరోలా ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా మోటో జీ96పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Motorola G96 5G
- ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ 2026 ఆఫర్లు
- మోటోరోలా G96 5జీపై అద్భుతమైన డీల్
- మోటోరోలా జీ96 ఫోన్ రూ. 22,999కు లిస్టింగ్
Motorola G96 5G : ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో వాలెంటైన్స్ డే సేల్ నడుస్తోంది. అనేక స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ మీకోసమే. ప్రస్తుతం బడ్జెట్-ఫ్రెండ్లీ మోటోరోలా G96 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మోటోరోలా ఫోన్‌కు మార్కెట్లో కూడా ఫుల్ డిమాండ్ ఉంది. ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా కొత్త ఫోన్ కొనాలని చూస్తుంటే ఓసారి లుక్కేయండి.
8GB ర్యామ్ వేరియంట్ చాలా చీప్ :
ఈ మోటోరోలా జీ96 ఫోన్ రూ. 22,999కు లిస్ట్ అయింది. 8జీబీ ర్యామ్, 256GB స్టోరేజీతో ఐఫోన్ ప్యాంటోన్ అస్లేగ్ బ్లూ వేరియంట్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ సమయంలో 17శాతం తగ్గింపుతో లభిస్తుంది. అంటే.. మోటోరోలా జీ96 ఫోన్ ధర రూ. 18,999కే ఇంటికి తెచ్చుకోవచ్చు.
మోటోరోలా G96పై బ్యాంకు ఆఫర్లు :
బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. ఐసీఐసీఐ లేదా యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ. 1,000 తగ్గింపు పొందవచ్చు. అదనంగా, మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 18,200 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. అన్ని నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. ఈఎంఐ కొనుగోలుపై రోజుకు రూ. 926 ఈఎంఐతో కొనేసుకోవచ్చు.
మోటోరోలా G96 5జీ కీలక ఫీచర్లు :
ఈ మొబైల్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 3D-కర్వ్డ్ pOLED FHD+ డిస్ప్లేతో వస్తుంది. 1600 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 15-ఆధారితంగా రన్ అవుతుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్ప్లే ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఇప్పుడు, కెమెరా, వీడియో క్వాలిటీపరంగా అద్భుతంగా ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరాతో వస్తాయి.
బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. 33W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5500mAh బ్యాటరీని అందిస్తుంది. WiFi, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ పోర్ట్ వంటి ఫీచర్లతో లభ్యమవుతుంది.
